కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు సినిమాతో హీరోగా కెరీర్ మొదలుపెట్టాడు. తొలి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో విజయ్ దేవరకొండకు వరుస అవకాశాలు వచ్చాయి. పెళ్లి చూపులు తరువాత విజయ్ నటించిన ద్వారక సినిమా ఫ్లాప్ అయినా అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో విజయ్ కు ఫాలోయింగ్ పెరిగింది.ఈ సినిమా తరువాత విడుదలైన ఏ మంత్రం వేశావే సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వచ్చిందో విజయ్ అభిమానులకు కూడా గుర్తు లేదు. 
 
ఆ తరువాత విజయ్ ప్రత్యేక పాత్రలో నటించిన మహానటి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఒక హిట్టు రెండు ఫ్లాపులతో విజయ్ కెరీర్ ఉన్న సమయంలో గీతా గోవిందం సినిమాతో చిన్న సినిమాల్లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు విజయ్. ఈ సినిమాకు 70 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమా తరువాత విజయ్ తో సినిమా తీయాలనుకునే దర్శకుల సంఖ్య, సినిమా నిర్మించాలనుకునే నిర్మాతల సంఖ్య పెరిగిపోయింది. 
 
ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లుగా చలామణీ అవుతున్న కొందరు దర్శకులు కూడా విజయ్ తో సినిమా తీయాలని ప్రయత్నాలు చేశారు. కానీ గీతా గోవిందం తరువాత విజయ్ నటించిన సినిమాలేవీ థియేటర్ల దగ్గర 30 కోట్ల కలెక్షన్లు కూడా అందుకోలేదు. తెలుగు, తమిళం భాషల్లో విజయ్ నటించిన నోటా సినిమా డిజాస్టర్ కాగా టాక్సీవాలా అబవ్ యావరేజ్ అనిపించుకుంది. 
 
గీతాగోవిందంతో హిట్ పెయిర్ అనిపించుకున్న విజయ్ రష్మిక  మరోసారి డియర్ కామ్రేడ్ సినిమాలో నటించారు. కానీ కథ కథనాల్లో లోపాల వలన ఈ సినిమా కూడా డిజాస్టర్ అనిపించుకుంది. ఫిబ్రవరి 14వ తేదీన విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ కూడా డిజాస్టర్ కావడంతో విజయ్ కు అవకాశాలు కూడా తగ్గుతున్నాయని తెలుస్తోంది. సినిమా సినిమాకు విజయ్ మార్కెట్ తగ్గడంతో గతంలో ఎవరైతే విజయ్ తో సినిమా తీయాలని ప్రయత్నాలు చేశారో ఇప్పుడు వారే విజయ్ తో సినిమా తీయటానికి ఆసక్తి చూపించటం లేదని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: