అక్కడ దేవుడు ఆదేశిస్తాడు.. ఇక్కడ అరుణాచలం పాటిస్తాడు.. ఈ డైలాగ్ వెండితెరపై వింటుంటే థియేటర్లో చప్పట్లు.. విజిల్స్ తో సందడి చేశారు.. ఇది అరుణాచలం చిత్రంలో సూపర్ స్టార్ రజినీకాంత్ డైలాగ్.  భారతీయ చలన చిత్ర రంగంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఓ ప్రత్యేక శైలి ఉంది.  ఆయన స్టైల్ కి కేరాఫ్ అడ్రస్.. సిగరేట్ గాల్లో విసిరి నోట్లో వేసుకున్నారు.. తలను స్టైల్ గా దువ్వినా.. సూట్ ని అటూ ఇటూ తిప్పి నిల్చుకున్నా.. నడిచినా.. నవ్వినా ప్రతీ ఒక్కటీ స్టైల్.. ఆ స్టైల్ తోనే కోట్ల మంది హృదయాలు గెల్చుకున్నారు రజినీకాంత్.  సినీరంగంలో ఉన్నవారు రాజీకీయ రంగంలోకి రావడం ఇప్పటి సాంప్రదాయం కాదు.  పాత తరం నటులు ఎన్టీఆర్, ఎంజీఆర్, చిరంజీవి, కమల్ హాసన్ ప్రస్తుతం పవన్ కళ్యాన్ ఇలా ఎంతో మంది ఇలా ఎంతో మంది సీనియర్.. జూనియర్ నటులు రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.  కొంత మంది అయితే సొంత పార్టీలే స్థాపించి పోటీల్లో నిలబడ్డారు. 

 

రాజకీయాలు  వేరు సినీ రంగం వేరు.  ఇండస్ట్రీలో రాణించిన వారు రాజీకీయాల్లో రాణిస్తారని అనుంటే పొరపాటే.  ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి దిగ్గజాలే రాజకీయాల్లో సతమతమయ్యారు.  ఇదిలా ఉంటే గత కొన్ని సంవత్సరాలుగా రజినీకాంత్ రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారని వార్తలు వస్తున్నాయి.  కానీ ఆయన మాత్రం రాజీకీయ విషయం ఇంకా సస్పెన్స్ గానే కొనసాగిస్తున్నారు. లింగ చిత్రం నుంచి  ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన దర్భార్ వరకు వరుస చిత్రాల్లో నటిస్తూ వస్తున్నారు.  మరి రజినీ రాజకీయ అరంగెట్రం ఎప్పుడు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.   ఇటీవల రాష్ట్రంలోని రజనీ ప్రజాసంఘం జిల్లా కార్యదర్శులతో స్థానిక కోడంబాక్కంలోని శ్రీరాఘవేంద్ర కల్యాణ మంటపంలో భేటీ అయిన విషయం తెలిసిందే.

 

ఈ సందర్భంగా రజినీకాంత్ పార్టీ స్థాపించాలంటే కొన్ని కండీషన్స్ అప్లై అన్నారట.. తనతో కలిసి రాజకీయాల్లోకి వచ్చేవారెవరికీ డబ్బు సంపాదించాలన్న ఆలోచన ఉండకూడదు.. ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న వారందరికీ పదవులు లభించకపోయినా బాధ పడకూడదు.. వీటికి కట్టుబడి ఉంటే రాజకీయాల్లోకి వస్తాను.. లేదంటే నా చిత్రాలు నేను చూసుకుంటానని చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రజనీకాంత్‌ వ్యాఖ్యలు తమకు షాక్‌ ఇచ్చాయని కార్యదర్శులు పేర్కొనట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు పార్టీ గురించి తలైవా ఎలాంటి ప్రకటన చేస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: