ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. భారత్ లో కూడా ఈ కరోనా వైరస్ వైరస్ ప్రభావం ఎక్కువ కావటంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 21 రోజులు పాటు లాక్‌ డౌన్ ప్రకటించారు. ఈ విషయం తెలిసిందే.. దీంతో అందరి ఇంటి పట్టునే ఉంటున్నారు. ఎవ్వరు బయటికి రావటం లేదు. ఒకవేళ బయటికి వచ్చిన సామజిక దూరం పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యవసర సేవలు చేసే పోలీస్, హాస్పిటల్,మీడియా, మున్సిపల్, ఫైర్ వంటి కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్ మాత్రం మినహాయింపు ఇచ్చారు.

 

ఈ విషయాలు తెలిసినవే కదా ఎందుకుచెప్తున్నారు అనుకుంటున్నారా.. అసలు విషయానికొస్తే.. సామాన్య ప్రజలతో సహా సెలెబ్రిటీలు కూడా తమ తమ పనులను (షూటింగ్) ఆపివేసి ఇంటి వద్దే ఉంటున్నారు. దింతో వీరు సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటున్నారు. వారు ఏ చిన్న చిన్న పనులు చేసినా కూడా వెంటనే సోషల్ మీడియా ద్వారా చేస్తున్న వాటి గురించి తమ అభిమానులకు షేర్ చేస్తున్నారు. అయితే.. ఇలానే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉన్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

“ మొక్కే కదా అని వదిలేస్తే, ... ... " my duty every morning #21daylockdown #StayHomeStaySafe

A post shared by chiranjeevi Konidela (@chiranjeevikonidela) on

 

అయితే.. ఈయన తెలుగు కొత్త సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా ఈ మెగాస్టార్ సోషల్ మీడియా ఫ్లాట్‌ ఫామ్‌ లోకి అడుగుపెట్టారు ఈ విషయం తెలిసిందే.. ఒకేసారి ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ లోకి అడుగుపెట్టారు. మెగాస్టార్ చిరంజీవికి రోజు రోజుకి ఫాలో అయ్యే వారి సంఖ్య పెరిగిపోతోంది. దీంతో పాటుగా చిరు కూడా తమ అభిమానులకు ఫొటోస్ ను షేర్ చేస్తున్నాడు. అయితే తాజాగా చిరంజీవి ఒక ఫోటోని షేర్ చేసాడు. ఈ ఫొటోలో చిరు తన ఇంట్లో ఉన్న మొక్కలకు నీళ్లు పెడుతున్నాడు. దీంతో పాటు మొక్కే కదా అని వదిలిస్తే., అని ఇంద్ర సినిమాలోని డైలాగ్‌ను యాడ్ చేసాడు. క్యాప్షన్ గా లాక్ డౌన్ కారణంగా 21 రోజులు ఇదే నా డ్యూటీ అంటూ పెట్టారు. ఇప్పుడు ఈయన కొరటాల శివ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఆచార్య సినిమాలో నటిస్తున్నారు.   

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: