క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ ఏకంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్ర‌క‌టించారు. ఈ లాక్‌డౌన్ ఈ నెల 14వ తేదీతో ముగుస్తోంది. ఇక మోదీ రేపు మంగ‌ళ‌వారం లాక్‌డౌన్ మ‌రో రెండు వారాలు పొడిగిస్తూ ప్ర‌క‌ట‌న చేస్తార‌ని యావ‌త్ దేశం అంత‌టా ఆస‌క్తితో వెయిట్ చేస్తోంది. ఇక మోదీ ప్ర‌క‌ట‌న‌తో సంబంధం లేకుండా ఇప్పుటికే ఏడు రాష్ట్రాలు లాక్‌డౌన్ ఈ నెల 30వ తేదీ వ‌ర‌కు ప్ర‌క‌టించాయి. ఇక క‌రోనా ఎఫెక్ట్‌తో దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సినిమా ప‌రిశ్ర‌మ‌లు బంద్ అయ్యాయి.

 

షూటింగ్‌లు ర‌ద్దయ్యాయి... రిలీజ్‌లు వాయిదా ప‌డ్డాయి. ఈ లాక్‌డౌన్ వ‌ల్ల దేశంలో ఉన్న‌ ఇండస్ట్రీస్‌కు సంబంధించిన పెద్ద సినిమాలు రీ షెడ్యూల్ చేయాల్సి వస్తోంది. థియేటర్స్, మాల్స్,మల్టీప్లెక్స్ అన్ని బంద్ అయ్యాయి.మన దేశంలోని అన్ని చిత్రపరిశ్రమలు దాదాపు రూ. 3 వేల కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు అంచనా.  ఒక్క టాలీవుడ్‌కే ఏకంగా రు. 800 కోట్లు న‌ష్టం వాటిల్లింద‌ని అంటున్నారు. అస‌లు గ‌త ఐదారు ద‌శాబ్దాల్లో ఇలాంటి గ‌డ్డు ప‌రిస్థితిని ఇండ‌స్ట్రీ ఎప్పుడు ఎదుర్కోలేదు.

 

ఇక క‌రోనా లాక్‌డౌన్ త‌ర్వాత ప్ర‌జ‌లు ఖ‌చ్చితంగా ఖ‌ర్చు విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తారు. ఈ క్ర‌మంలోనే సినిమా థియేట‌ర్ల‌కు వ‌చ్చేవారి సంఖ్య కూడా త‌గ్గుతుంది. ప్రేక్షకులు కొన్నేళ్ల పాటు ధియేటర్లకు దూరంగా ఉండే అవకాశం లేకపోలేదు. సినీ నిర్మాతలు కూడా ఇదే రకమైన అంచనాతో ఉన్నారు.సినిమా కలెక్షన్లపై కరోనా ప్రభావం ఏ రకంగా ఉంటుందనే విషయం రెండు మూడు పెద్ద సినిమాలు విడుదలైతే కానీ తెలియదు. లాక్‌డౌన్ తర్వాత థియేట‌ర్ల‌లో రూల్స్ మార‌తాయంటున్నారు.

 

మ‌ల్టీఫ్లెక్స్‌ల్లో యాజ‌మాన్యం సీట్ల‌ను త‌గ్గించి మ‌నిషికి మ‌నిషికి క‌నీసం మూడు సీట్లు గ్యాప్ ఉండేలా సిట్టింగ్ సిస్ట‌మ్ ఏర్పాటు చేస్తార‌ట‌. అంటే 50 శాతం టికెట్లు మాత్రమే అమ్మాలనే కొత్త నిబంధనను అనుసరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అలాగే టిక్కెట్ల రేట్లు కూడా త‌గ్గించ‌క త‌ప్ప‌దంటున్నారు. అదే జ‌రిగితే భారీ న‌ష్టాలు త‌ప్ప‌వు.

మరింత సమాచారం తెలుసుకోండి: