ద రియల్ మెన్ ఛాలెంజ్ వైరస్ లా మారింది. సెలబ్రెటీస్ ఇస్తున్న ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మన హీరోలు ఇంటి పనుల్లో బిజీ అయిపోయారు. ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్ ను సీనియర్ హీరోలు చిరంజీవి, వెంకటేష్ నెరవేర్చారు. చిరంజీవి కేటీఆర్ ను.. వెంకటేశ్ మహేశ్ ను నామినేట్ చేసి బిద రియల్ మేన్ ఛాలెంజ్ ను అందరి దగ్గరకు తీసుకెళ్తున్నారు. 

 

ఇంటిపనుల్లో ఆడవాళ్లకు సాయంగా.. తోడుగా ఉండే ఉద్దేశంతో అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా విసిరిన బిద రియల్ మేన్ ఛాలెంజ్ ను రాజమౌళి నెరవేర్చి.. ఎన్టీఆర్.. రామ్ చరణ్.. కీరవాణిని నామినేట్ చేశారు. రాజమౌళి నామినేట్ చేసిన ముగ్గురు ఈ ఛాలెంజ్ ను నెరవేర్చారు. 

 

బి ద రియల్ మేన్ ఛాలెంజ్ కొనసాగుతూ.. సెలబ్రెటీస్ అందరితో ఒళ్లు వంచేలా చేస్తోంది. తారక్ విసిరిన ఛాలెంజ్ ను వెంకటేశ్ నెరవేర్చాడు. అందరూ ఇంటి పని చేస్తుంటే.. వెంకటేష్ ఎక్కువగా తోటపని చేశాడు. దీనితో పాటు.. కిచెన్ రూమ్ లో కూడా సందడి చేసి చిన్నోడు మహేశ్ కు ఛాలెంజ్ విసిరాడు. కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన ఎఫ్ 2 దర్శకుడు అనిల్ రావిపూడిని... కో బ్రో వరుణ్ తేజ్ ను నామినేట్ చేశాడు వెంకటేష్. 

 

ఎన్టీఆర్ ఛాలెంజ్ ను చిరంజీవి స్వీకరించి వీడియోను రిలీజ్ చేశాడు. అందరూ చీపురు పట్టుకుంటే.. వాక్యూమ్ క్లీనర్ తో రూమ్ క్లీన్ చేశాడు. కిచన్ రూమ్ లోనూ సత్తా చాటాడు మెగాస్టార్. దోశె వేయడంలో ఎక్స్ పర్ట్ అయిన చిరంజీవి తల్లి కోసం ఉప్మా పెసరట్టు వేశాడు. చెఫ్ మాదిరి నాన్ స్టిప్ పాన్ ఎగరేసి దేశెను తిప్పి ఎక్స్ పర్ట్ అనిపించుకున్నాడు. తల్లీకొడుకులు ఒకరినొకరు తినిపించుకోవడం నెటిజన్లను ఆకట్టుకుంది. బ్యాక్ డ్రాప్ గా తమ్ముడు లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ లోని మగువా పాటను బ్యాక్ డ్రాప్ గా వాడుకొని.. సెంటిమెంట్ గా ఆకట్టుకున్నాడు చిరంజీవి. 

 

తారక్ నువ్వు ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించాను. నేను రోజు చేసే పనులే.. ఈ రోజు మీకోసం ఈ వీడియో సాక్ష్యం అంటూ ట్వీట్ చేశాడు చిరంజీవి. ఇప్పటి వరకు సినిమాా హీరోల చుట్టూ తిరిగిన ఈ ఛాలెంజ్ కు చిరంజీవి పొలిటికల్ టచ్ ఇచ్చాడు. తెలంగాణ మంత్రి కేటీఆర్ ను నామినేట్ చేశాడు. అలాగే స్నేహితుడు.. సూపర్ స్టార్ రజినీకాంత్ కు కూడా ఛాలెంజ్ విసిరాడు చిరంజీవి. 

మరింత సమాచారం తెలుసుకోండి: