ఇక మన టాలీవుడ్ విషయానికి వస్తే మన తెలుగు నటీ నటులు కూడ ఇంస్టాగ్రామ్ లో బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు. ఇక మన తెలుగులో ఇంస్టాగ్రామ్ లో ఎక్కువ మంది ఫాలోయర్స్ సంపాదించుకున్న నటీ నటులు మీద "ఏ. పి. హెరాల్డ్" అందిస్తున్న ఈ జాబితా మీకోసం చూడండి.
ఇప్పుడు మన టాలీవుడ్ తరపు నుంచి ఇంస్టాగ్రామ్ లో ఎక్కువ ఫాలోయర్స్ జాబితా గురించి తెలుసుకుందాం చూడండి. ముందుగా హీరోయిన్స్ లో చూసుకున్నట్లు అయితే తాప్సి మొదటి స్థానంలో వుంది. ఇప్పుడు తెలుగులో సినిమాలు లేకపోయినా బాలీవుడ్ లో మంచి పాత్రలు చేసుకుంటూ అవకాశాలు కల్పించుకుంటుంది తాప్సి. ఇక పోతే తాప్సి 17.4 మిలియన్ల ఫాలోయర్స్ తో ముందు వరసలో వుంది. మన సౌత్ ఇండియా హీరోయిన్ లలో టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఇక తాప్సి తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ 15.1 మిలియన్ల ఫాలోయర్స్ తో రెండవ స్థానం లో వుంది. 14.8 మిలియన్ల ఫాలోయర్స్ తో కాజల్ అగర్వాల్, 14.5 మిలియన్ల ఫాలోయర్స్ తో శృతి హాసన్ నువ్వా నేనా అని పోటీ పడుతున్నారు. తర్వాత సమంత, పూజ హెగ్డే కూడ 11.3 మిలియన్ల ఫాలోయర్స్ తో పోటీ పడుతున్నారు. అసలు వీళ్ళందరి కంటే తన మొదటి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో నేనొక్కడినే సినిమాలో నటించిన కృతి సనన్ అత్యధికంగా రికార్డు స్థాయిలో 36 మిలియన్ల ఫాలోయర్స్ తో దూసుకుపోతుంది. కాని ఈమె తెలుగులో చేసింది కేవలం రెండు సినిమాలు మాత్రమే. తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడ స్టార్ హీరోయిన్ గా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ సమపాదించుకుంది. తన సినిమా ఎంట్రీ మొదట టాలీవుడ్ తో ఇచ్చిన ఇక్కడ అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది.
ఇక తెలుగు హీరోలలో చూసుకుంటే విజయ్ దేవరకొండ 8.3 మిలియన్ల ఫాలోయర్స్ తో టాప్ లో వున్నాడు. తర్వాత అల్లు అర్జున్ 7.9 మిలియన్ ఫాలోయర్స్ తో రెండవ స్థానం లో తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు 5.4 మిలియన్ల ఫాలోయర్స్ తో, ప్రభాస్ 5 మిలియన్ల ఫాలోయర్స్ తో వున్నారు. ఇక తర్వాత రానా 4.1మిలియన్ల ఫాలోయర్స్ తో, రాంచరణ్, నానీ 2.7 మిలియన్ల ఫాలోయర్స్, ఎన్టీఆర్, రామ్ పోతినేని 1.9 మిలియన్ల ఫాలోయర్స్ తో వున్నారు.
https://instagram.com/instagram?igshid=j6lbjgbohjzf
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి