‘కొచ్చాడియన్’ విడుదల కాకుండానే తన మనవడు లింగ పేరును తన కొత్త సినిమా టైటిల్ గా మార్చుకుని గత వారం మైసూర్ లో మొదలు పెట్టిన రజినీ కొత్త సినిమాకు ఆ సినిమా నిర్మాతలు రాక్ లైన్ వెంకటేష్ నుండి రజినీ పారితోషికంగా 40 కోట్లు తీసుకున్నాడు అనే వార్త ఇప్పుడు దక్షినాది సినిమా రంగంలో హాట్ న్యూస్ గా మారింది. సామాన్యంగా రజినీ తన సినిమాలకు 25కోట్ల పారితోషకంతో పాటు కొన్ని ఏరియాల హక్కులను ఆయనకు అప్పగిస్తారు.. కానీ తాజాగా లింగా సినిమాకు మొత్తం 40 కోట్లను నగదుగా తనకు ఇవ్వాలని రజినీ కండిషన్స్ పెట్టాడట. దీనికి కారణం రజినీ కుమార్తె సౌందర్య నిర్మించిన ‘కొచ్చాడియన్’ సినిమా అని అంటున్నారు. ఈ వారం విడుదల కాబోతున్న ఈ సినిమా మార్కట్ విషయంలో అనుకున్న అంచనాలను అందుకోలేక పోవడంతో ఈ సినిమా డెఫిషిట్ లో విడుదలవుతోందట. రజినీకాంత్ భార్య కుడ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండటంతో ఈ నష్టాన్నిభర్తీ చేయడానికే రజనీకాంత్ ‘లింగా’ సినిమాను హడావిడిగా సెట్స్ మీదకు తీసుకెళ్లారని కోలీవుడ్ టాక్.  రజనీ సినిమా అంటే వందకోట్ల బిజినెస్ ఉండడంతో నలభై కోట్లు ఇవ్వడానికి నిర్మాతలు పెద్దగా ఆలోచించ లేదని అంటున్నారు. మెలి తిరిగిన మీసం, ప‌ట్టు పంచె, మెడ‌పై కండువా ర‌జ‌నీ కొత్త గెటప్ `లింగా` సినిమాకు మంచి క్రేజ్ ను ఇస్తోంది. ఈ సినిమాలో రజినీని చూస్తుంటే పాత ర‌జ‌నీని చూసిన అనుభూతి క‌లుగుతోంద‌ని అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఎదిఎమైనా రజినీకాంత్ తన కొచ్చాడియన్ ఫలితం ఎలా ఉన్నా తన కెరియర్ కు దెబ్బ లేకుండా చాల తెలివిగా అడుగులు వేస్తున్నాడు అనే మాటలు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: