ప్రిన్స్ మహేష్ బాబు హీరోయిన్ కృతి సనన్ హీరోల పై వింత కామెంట్స్ చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ లో మగవారితో పోలిస్తే ఆడవాళ్లకే అవకాశాలు విస్తృతంగా వస్తున్నాయని టాలీవుడ్ లో బయట ప్రాంతాల నుంచి వచ్చే హీరోయిన్స్ ను విపరీతంగా ప్రోత్సహిస్తున్నారని అనుభవం లేకపోయినా అవకాశాలు ఇస్తున్నారని టాలీవుడ్ నిర్మాతలను ఆకాశానికి ఎత్తేసింది.
అయితే హీరోల విషయంలో మాత్రం పరిస్థితి దీనికి భిన్నంగా ఉందని దీనికి కారణం సినిమా అనేది హీరో భుజస్కంధాలపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి హీరోల విషయంలో నిర్మాతలు రిస్క్ చేయలేక పోతున్నారని తన మనసులో మాట బయట పెట్టింది మహేష్ హీరోయిన్. ఏదిఏమయినప్పటికీ మగవాళ్లకంటే ఆడవాళ్లకే అవకాశాలు బాగా లభిస్తున్నాయి అన్నది ఆమె అభిప్రాయం.
మోడల్ గా ముంబాయ్ లో బాగా పేరు సంపాదించుకున్న కృతి మహేష్ లాంటి టాప్ హీరోతో నటించి సంచలనం చేసినా అదృష్టం కలిసి రాలేదు. ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కోవాలి అనే సామెతకు అనుగుణంగా కృతి టాలీవుడ్ నిర్మాతలను పొగుడ్తూ చేస్తున్న ఈ భజన కార్యక్రమం ఆమెకు ఎంత వరకు అవకాశాలను తెచ్చి పెడతాయో చూడాలి.
హీరోయిన్స్ కు అవకాశాలు లేకపోతే ఫోటో షూట్స్ ఇచ్చుకునైనా కాలం గడపవచ్చు. కాని ఆ అవకాశం కొత్త హీరోలకు ఎక్కడ ఉంటుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: