బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్  మరణం పెను ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సుశాంత్ కేసు సిబిఐ చేతికి రాగా  సుశాంత్ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని ప్రియురాలు రియా చక్రవర్తి అరెస్టయిన విషయం తెలిసిందే. ఇక మరిన్ని వివరాలు సేకరించేందుకు సిబిఐ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇక రోజురోజుకు సుశాంత్ కేసు ఎన్నో కీలక మలుపులు తిరుగుతూ ఉంది. అదే సమయంలో సుశాంత్ మృతిపై బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇంకా కీలక చర్చలు జరుగుతూనే ఉన్నాయి.



 ఈ క్రమంలోనే బాలీవుడ్ లో  దర్శకుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న  దర్శకుడు అనురాగ్  కశ్యప్  సుశాంత్ గురించి తాజాగా ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. తాను ఇప్పటివరకు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో  పని చేయక పోవడానికి గల కారణాలు ఏమిటి అనే విషయాలను అభిమానులకు తెలియజేసాడు స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్. ప్రస్తుతం అనురాగ్ కశ్యప్ పెట్టిన పోస్టు కాస్త చర్చనీయాంశంగా మారిపోయింది. సుశాంత్ సింగ్ ఒక సమస్యాత్మక వ్యక్తి అని... అందుకే అతనితో పని చేయలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అనురాగ్ .



 బాలీవుడ్ చిత్ర పరిశ్రమ సుశాంత్ సింగ్ ను కావాలనే పక్కన పెట్టింది అంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు స్పందించిన అనురాగ్ కశ్యప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ చనిపోవడానికి కొన్ని వారాల ముందు అతని మేనేజర్ తో  అనురాగ్ కశ్యప్ చేసిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ తీసి అందరికీ షేర్ చేశారు. మీ సినిమాలో  ఏదైనా పాత్ర ఉంటే సుశాంత్ ను దృష్టిలో పెట్టుకోండి  అంటూ అతని మేనేజర్ అనురాగ్ ను  కోరాడు. ఇక దీనికి సమాధానం ఇచ్చిన దర్శకుడు అనురాగ్ కెరీర్ ప్రారంభం నుంచి సుశాంత్  తనకు తెలుసని.. సుశాంత్ ఒక సమస్యాత్మకమైన వ్యక్తి అంటూ రిప్లై ఇచ్చారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన అనురాగ్ ప్రస్తుతం ఈ విషయాన్ని బయట పెడుతున్నందుకు నన్ను క్షమించండి.. సుశాంత్ చనిపోవడానికి మూడు వారాల ముందు ఇది  జరిగింది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: