రవితేజకి మాస్ ఎంటర్‌టైనర్స్‌తోనే సూపర్ ఫాలోయింగ్ వచ్చింది. అందుకే మాస్ మహారాజ్‌గా ఈ జానర్‌నే కంటిన్యూ చేస్తున్నాడు రవితేజ. అయితే ఈ హీరో ఎంత కష్టపడినా మూడేళ్లుగా సక్సెస్ కొట్టలేకపోతున్నాడు. 'రాజా ది గ్రేట్' తర్వాత రవితేజ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గానే నిలిచాయి.
రవితేజ సక్సెస్ అనే మాట విని మూడేళ్లు అవుతోంది. ఈ పీరియడ్‌లో రవి నాలుగు సినిమాలు చేస్తే, ఆ నాలుగు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. 'టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కోరాజా' అన్నీ ఫ్లాపుల్లోనే కలిసిపోయాయి. దీంతో రవితేజ మార్కెట్ కూడా పడిపోయింది.
రవితేజ కంపల్సరీగా హిట్ కొట్టాల్సిన స్టేజ్‌లో తనకి కలిసొచ్చిన మాస్, కామెడీ ఎంటర్‌టైనర్స్‌కే కమిట్ అవుతున్నాడు. 'డాన్ శీను, బలుపు'తో మంచి హిట్స్ ఇచ్చిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'క్రాక్' చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత మారుతి డైరెక్షన్‌లో ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ చేస్తాడనే టాక్ వస్తోంది. మరి స్టార్డమ్ తెచ్చిన మాస్ కామెడీనే నమ్ముకున్న రవితేజని ఈ జానర్ ఎంతవరకు సేవ్ చేస్తుందో చూడాలి.
మొత్తానికి రవితేజ డేంజర్ జోన్ లో పడ్డారనే టాక్ వినిపిస్తోంది. మూడేళ్లుగా సరైన హిట్ లేకపోవడంతో మాస్ మహారాజా కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. రాజాది గ్రేట్ తర్వాత ఆయన్ను వరుస ఫ్లాపులు చుట్టుముట్టడంతో రవితేజ ఫుల్ డిసప్పాయింట్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మాస్ ఎంటర్ టైనర్స్ తో వస్తోన్న రవితేజ.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న క్రాక్ తో తన అధృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి