ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ న్యూస్ చదవండి... మెగాస్టార్ చిరంజీవి నటించిన 2004వ సంవత్సరం అక్టోబర్ 15న విడుదలైన ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘అంజి’ చిత్రంతో నిరుత్సాహపడిన మెగా ఫ్యాన్స్ కు ఈ చిత్రం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. జయంత్.సి.పరాన్జీ డైరెక్షన్లో వచ్చిన ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’ చిత్రం.. హిందీలో సూపర్ హిట్ అయిన ‘మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్’ చిత్రానికి రీమేక్. అయితే మెగాస్టార్ కు ఈ చిత్రం టైలర్ మేడ్ అనే చెప్పాలి. ‘రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగి తో సమానం’ అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కింది. ‘మొదటిసారి మెగాస్టార్.. తన ఇమేజ్ కు పూర్తి భిన్నంగా ఉన్న సినిమా చేస్తున్నారు..


రిస్క్ చేస్తున్నారా’ అనే కామెంట్స్ కూడా ఇండస్ట్రీలో వినిపించాయి.అందులోనూ తన ఆస్థాన సంగీత దర్శకుడు మణిశర్మ ను పక్కన పెట్టి దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడం పట్ల కూడా నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. కానీ ఏవైతే నెగిటివ్ అనుకున్నారో…తరువాత సినిమాకి అవే ప్లస్ పాయింట్స్ అయ్యాయి. ఏ.టి.యం పాత్రకు ముందుగా రవితేజ వంటి ఎంతో మంది హీరోలను అనుకున్నారు. కానీ శ్రీకాంత్ నే ఫిక్స్ చెయ్యమని చిరు పట్టుపట్టారు. ఆ పాత్ర కూడా చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించింది. 10 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం 27 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి అందరికీ షాక్ ఇచ్చింది.

సాధారణంగా అక్టోబర్ నెల టాలీవుడ్ సినిమాలకు డ్రై సీజన్ అంటారు. అలాంటి సీజన్ లో విడుదలయ్యి కూడా బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించింది ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’ చిత్రం. అప్పటికి చిరు కెరీర్లో ‘ఇంద్ర’ తరువాత … అలాగే టాలీవుడ్ చరిత్రలోనూ సెకండ్ హైయెస్ట్ కలెక్షన్లను రాబట్టిన చిత్రంగా ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’ చిత్రం రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలో ‘చిరు వాకింగ్ స్టైల్’ మరియు ఇంగ్లీష్ లో ఆయన పలికే ఫన్నీ సామెతలు అప్పట్లో బాగా ఫేమస్ అయ్యాయని చెప్పొచ్చు. ఈ చిత్రం విడుదలయ్యి 16ఏళ్ళు పూర్తికావస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: