ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ న్యూస్ చదవండి... రాజ్ తరుణ్ మొదట్లో వరుసగా మూడు హిట్లు కొట్టగానే టాలీవుడ్ కి కాబోయే స్టార్ హీరో వచ్చాడని అనుకున్నారు అందరు. రవి తేజ లాగా ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చాడు. కచ్చితంగా రవితేజ అంత గొప్పవాడు అవుతాడు అనుకున్నారంతా. కాని ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమా తరువాత రాజ్ తరుణ్ నటించిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ తరువాత అతను నటించిన ‘అందగాడు’ ‘రంగుల రాట్నం’ ‘రాజు గాడు’ ‘లవర్’ ‘ఇద్దరి లోకం ఒక్కటే’ వంటి చిత్రాలు పూర్తిగా నిరాశపరిచాయి. అయితే తరువాత అతను నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రం కరోనా లాక్ డౌన్ వల్ల థియేటర్లలో విడుదల కాలేదు. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ‘ఒక లైలా కోసం’ ఫేమ్ కొండా విజయ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు.

గతేడాది ‘ఖైదీ'(తమిళ్) వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన ‘శ్రీ సత్య సాయి ఆర్ట్స్’ అధినేత రాధా మోహన్ నిర్మించిన చిత్రం కావడంతో.. ‘ఒరేయ్ బుజ్జిగా’ పై క్రేజ్ ఏర్పడింది. అక్టోబర్ 2న ఆహా లో విడుదలైన ఈ చిత్రం.. ప్రస్తుతం లాభాల బాట పట్టినట్టు సమాచారం. 4 కోట్లకు ఈ చిత్రాన్ని కొనుగోలు చేసారు ఆహా వారు. ‘నిశ్శబ్దం’ చిత్రం విడుదలైన రోజునే ‘ఒరేయ్ బుజ్జిగా’ కూడా విడుదలయ్యింది.

ఆ చిత్రానికి నెగిటివ్ టాక్ రావడం కూడా ‘ఒరేయ్ బుజ్జిగా’ కు హెల్ప్ అయ్యిందని చెప్పొచ్చు. అలా అని ఈ చిత్రానికి కూడా పాజిటివ్ రివ్యూలు అయితే రాలేదు. కానీ ఈ చిత్రమే కాస్త బెటర్ అన్నట్టు ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. ఏదైతేనేం ఈ రకంగా రాజ్ తరుణ్ ఓ హిట్టు కొట్టినట్టే..! ఇక ఇలాంటి ఆసక్తికరమైన సినిమా ల గురించి కొత్త కొత్త అప్ డేట్స్ తెలుసుకోడానికి ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: