హీరోయిన్ కీర్తి సురేష్.. తెలుగులో అతి తక్కువకాలంలో మంచి పాపులార్టీ తెచ్చుకుంది. మహానటితో.. ఇటు తెలుగు, అటు తమిళ ప్రేక్షకుల మనసు దోచుకుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ టాప్ హీరోలందరితో కలసి నటిస్తోంది. హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ కి అనుష్క తర్వాత బెస్ట్ ఆప్షన్ కీర్తి సురేష్ అనే పేరు కూడా వచ్చేసింది. అయితే ఇంతకీ కీర్తి ఎవరితో అయినా ప్రేమలో పడిందా..? పడితే ఆ లక్కీ ఫెలో ఎవరు..? ఇటీవల ట్విట్టర్లో అభిమానులతో ముచ్చటించిన కీర్తి సురేష్.. తన మనసులో మాటలు చాలానే బైటపెట్టింది.
మిస్ ఇండియా మూవీ ప్రమోషన్లో భాగంగా కీర్తి సురేష్ ట్విట్టర్లో ఓ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నడిపింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆమె ఎంతో ఓపికగా సమాధానాలు చెప్పింది.

చిన్న చిన్న విషయాల్లోనూ సంతోషాన్ని వెదకడం తాను క్వారంటైన్ కాలంలో నేర్చుకున్నట్టు తెలిపింది కీర్తి సురేష్. ఇక లాక్ డౌన్ కాలంలో కీర్తి సురేష్ బాగా బరువు తగ్గింది. చాలామంది ఈ విషయంపైనే ఆమెను ప్రశ్నలు అడిగారు. ఇంత తక్కువ టైమ్ లో ఎలా బరువు తగ్గారు, స్లిమ్ గా అవడానికి మీకు ప్రేరణ ఎవరు అని ప్రశ్నించారు. బరువు తగ్గడానికి తాను బాగా వర్కవుట్స్ చేశానని, డైటీషియన్ సలహాలతో ఫుడ్ హ్యాబిట్స్ పై కంట్రోల్ పెట్టానని చెప్పింది కీర్తి సురేష్.
సినిమాలు ఫ్లాపయినా, హిట్టయినా ఒకేలా చూస్తానని, నెగెటివ్ కామెంట్స్, ట్రోలింగ్స్ ని తానసలు పట్టించుకోనని చెప్పింది కీర్తి సురేష్. ట్రోలింగ్ ని పట్టించుకోకపోవడం అంటే.. వాటిని గట్టిగా ఎదుర్కోవడమేనని వివరించింది కీర్తి. త్వరలోనే తాను ఓ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నట్టు చెప్పింది.
సినిమాల విషయంలో సరికొత్త ప్రయోగాలు చేయడం తనకి ఇష్టమని, అందుకే.. హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ వైపు మొగ్గు చూపానంటోంది కీర్తి సురేష్. చిన్నప్పుడు తనకు లాయర్ అవ్వాలనే కల ఉన్నట్టు చెప్పింది.

ఇక అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్నకు చాలా తెలివిగా సమాధానం చెప్పింది మహానటి. మీరు సింగిలా, లేక కమిటెడా అని ఓ అభిమాని కీర్తిని ప్రశ్నించాడు. అయితే ఆమె తెలివిగా కమిటెడ్ టు వర్క్ అని తేల్చేసింది. పనిపైనే తనకు ప్రేమ ఉందని చెప్పింది కీర్తి. ఇప్పటి వరకు కీర్తి సురేష్ లవ్ వ్యవహారంపై ఎలాంటి పుకార్లు కూడా బైట వినిపించకపోవడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: