ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. నటసింహ  బాలకృష్ణబోయపాటి శ్రీనుది మంచి పవర్ ఫుల్  కాంబినేషన్ అని తెలిసిన సంగతే.  ఇక గతంలో  వీరి కలయికలో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో ముచ్చటగా మూడోసారి సినిమా రాబోతుంది.ఇక ఈ సినిమా హీరోయిన్ ఎంపికతో బాలయ్యను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే...   ఫైనల్ గా ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా నటి సాయేషా సైగల్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

సాయేషా  ‘అఖిల్’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.  ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో తరువాత  కోలీవుడ్కి వెళ్ళిపోయింది. అక్కడే వరుస అవకాశాలు రావడంతో నటిగా బిజీ అయిపోయింది. స్టార్ హీరో ఆర్యని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. పెళ్లి అయినప్పటికీ హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో బాలయ్య సరసన హీరోయిన్ గా ఛాన్స్ రావడంతో అంగీకరించింది.

సాయేషా వయసు కేవలం 23 ఏళ్లు మాత్రమే. ఈ ఇరవై ఏళ్ల బ్యూటీ అరవై ఏళ్ల హీరో సరసన నటిస్తుండడంపై సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. కూతురి కన్న తక్కువ వయసు వున్న అమ్మాయితో సినిమా చెయ్యటం ఏంటని బాలయ్యని తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్.. 

మరింత సమాచారం తెలుసుకోండి: