అవునూ..
సూపర్ స్టార్ మహేష్ బాబు సిస్టర్
మంజుల ఘట్టమనేని అందరికీ సుపరిచితురాలే. సరికొత్త ప్రయాణం మొదలు పెట్టింది. అయితే ఇంతకీ ఆమె ఏం మొదలు పెట్టింది? ఇపుడు ఏం చేస్తుంది? అనే విషయాలు ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం రండి..
.jpeg)
ఇక అసలు వివరాల్లోకి వెళితే..
సూపర్ స్టార్ కృష్ణ కూతురిగా సినిమాల్లో
హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలనుకుంది
మంజుల ఘట్టమనేని.
మంజుల ప్రస్తుతం
సినిమా నిర్మాణ రంగంలో ఉన్నారు.
ఇందిరా ప్రొడక్షన్ సంస్థను స్థాపించి గతంలో కొన్ని చిత్రాలను నిర్మించారు. నటిగాను పలుసినిమాల్లో నటించింది.
నీలకంఠ ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన "షో" సినిమాతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపుని దక్కించుకుంది. ఇటీవల
మంజుల దర్శకురాలిగా కూడా మారారు.
సందీప్ కిషన్ తో "మనసుకు నచ్చింది"
సినిమా చేశారు. ఈ
సినిమా పరాజయం పాలయ్యింది.
.jpeg)
ఇదిలా ఉంటే..
మంజుల ప్రస్తుతం మరో ప్రయత్నం మొదలు పెట్టిందట.
మంజుల ఘట్టమనేని అనే పేరుతో ఓ
యూట్యూబ్ ఛానల్ ను ఏర్పాటు చేసారు. తన లైఫ్ లో ఎదురైన అనుభవాలను దీనిద్వారా అభిమానులతో పంచుకోనున్నారు. "లైఫ్లో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఎత్తు పల్లాలు చూశాను. నా టీచర్స్ అండ్ మాస్టర్స్ నాకు ఎన్నో విషయాలు నేర్పించారు. నా ఈ ప్రయాణంలో నేను నేర్చుకున్న విషయాల్ని ఎంత వరకు మీకు అందించాలనుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదండోయ్ "మంజుల ఘట్టమనేని" పేరుతోనే వెబ్ సైట్ ను కూడా ప్రారంభించారు మంజుల. అయితే సినిమాలతో పాటు డైట్, ఫిట్నెస్ వంటి విషయాలపై కూడా అవగాహన ఉందని
మంజుల చెప్పుకొచ్చారు. తాజా ఇంటర్వ్యూలో
మహేష్ గురించి
మంజుల కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశారు.
మహేష్ తన కంటే చిన్నవాడైనప్పటికీ ఆమెనే అనేక విషయాలలో గైడ్ చేస్తాడట. అందరూ అనుకుంటున్నట్లు
మహేష్ కి నేను దిశా నిర్ధేశం చేయనని
మంజుల వివరించారు. అందరూ నా
బ్యూటీ సీక్రెట్ ఏమిటని అడుగుతారు, కానీ అది
నాన్న జీన్స్ ద్వారా వచ్చిందని
మంజుల అన్నారు.