నయనతార తన అద్భుతమైన నటనతో అభిమానుల సైన్యాన్ని పెంచుకుంటూ సినీ పరిశ్రమలో తిరుగులేని రారాణిగా రాణిస్తోంది. దక్షిణాది లేడీ సూపర్ స్టార్ గా కీర్తిని పొందింది. 36 ఏళ్ల ఈ భామకు అవకాశాలు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. వయసు పెరుగుతున్న కొద్దీ తన నటనా ప్రతిభకు మరింత పదును పెంచి ప్రేక్షకులను ఆకర్షిస్తోంది నయన. నయనతార కోసమే స్పెషల్ గా కథలు రూపుదిద్దుకుంటున్నాయి అంటే ఆమె టాలెంట్ ఎటువంటిదో చెప్పనక్కర్లేదు. ఇక ఇటీవలే (నవంబర్ 18) న  అందాలనటి నయనతార తన పుట్టినరోజును ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే...ఆమె ప్రియుడు విఘ్నేశ్ శివన్ ఆమె పుట్టినరోజు వేడుకను ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసి నయనతారకు సర్ప్రైజ్ ఇచ్చారట.

తమ అభిమాన లేడీ డాన్ పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలిపారు అభిమానులు మరియు కొందరు సినీ ప్రముఖులు. అయితే ఈ సారి తన పుట్టినరోజు కు మరో అరుదైన బహుమతి లభించింది. అందులోనూ దాన్ని తన డిగ్రీ క్లాస్ మేట్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. నయనతార పుట్టినరోజు సందర్భంగా  ఆమె డిగ్రీ క్లాస్ మేట్ కేరళకు చెందిన మహేష్ కదమ్మనిట్ట పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి చక్కెర్లు కొడుతోంది. ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందంటే.....!!! నేను నయన్ కేరళలోని తిరువల్లోని మార్తోమా కాలేజీలో డిగ్రీ క్లాస్ మేట్స్. క్లాస్ రూములో నా పక్కనే కూర్చొనే నయన్ ఇంత గొప్ప స్టార్ గా ఎదుగుతుందని   నేనెప్పుడూ ఊహించలేదు. నెపొటిజం... పురుషాధిక్యం... ఉండే సినీ పరిశ్రమలో.. ఏ సపోర్ట్ లేని ఓ యువతి రాణించడం నిజంగా గర్వించదగ్గ విషయం. నిజానికి ఆమె కెరియర్ ప్రారంభంలో చాలా విమర్శలు ఎదుర్కొన్నారు.

కానీ పరిశ్రమ మీద గౌరవంతో వాటినన్నింటినీ అధిగమించి.... తన లక్ష్యం వైపు అడుగులు వేసింది. పరిపూర్ణమైన కృషి అంకితభావం వల్లనే ఆమె విజయతీరాలకు చేరింది. 17 ఏళ్లుగా పరిశ్రమలో అగ్రస్థానంలో ఉండటం ఎంతో అద్భుతమైన విషయం. తిరువల్లలోని చిన్న గ్రామం నుండి వచ్చి కృషి పట్టుదలతో ఇంతటి ఘనతను సాధించిన మై డియర్ నయన్.... నీకు వేలవేల పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ మహేశ్ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టి తన అభిమానాన్ని వ్యక్తపరిచాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్బంగా అతడు   మార్తోమా కాలేజీలో 2002-05 నాటి ఆంగ్ల సాహిత్య బ్యాచ్లో నయన తార చేతి రాతతో ఉన్న నోట్ను కూడా షేర్ చేయడం ఆసక్తికరంగా మారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: