కింగ్ నాగార్జున మన్మథుడు 2 తర్వాత ఎలాంటి సినిమా చేయాలా అని కొద్దిగా కన్ ఫ్యూజ్ అయ్యారు. ఆ సినిమా ఇచ్చిన షాక్ అలాంటిదిలేండి. చిలసౌ సినిమాతో మెప్పించాడని రాహుల్ రవింద్రన్ కు మన్మథుడు 2 ఆఫర్ ఇచ్చాడు నాగ్ అయితే సినిమా రిజల్ట్ ఒకటి అనుకుంటే మరోటి జరిగింది. అందుకే తన నెక్స్ట్ సినిమాకు చాలా టైం తీసుకున్నారు నాగార్జున.

ప్రస్తుతం సోల్మన్ డైరక్షన్ లో వైల్డ్ డాగ్ సినిమా చేస్తున్నాడు నాగార్జున. ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తుంది. ఇక మరోపక్క బాలీవుడ్ లో చేస్తున్న బ్రహ్మాస్త్ర సినిమాని కూడా నాగార్జున తన పోర్షన్ పూర్తి చేసినట్టు తెలుస్తుంది. స్మాల్ స్క్రీన్ పై బిగ్ బాస్ హోస్ట్ గా కూడా నాగార్జున అదరగొడుతున్నారు. బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ చేసిన నాగ్ సీజన్ 4లో కూడా సత్తా చాటుతున్నారు.

వైల్డ్ డాగ్ తర్వాత ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో నాగార్జున సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇదే కాదు 2021లో కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో బంగార్రాజు సినిమాను కూడా ఎలాగైనా సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారట. మొత్తానికి నాగ్ 2021లో రెండు సినిమాలు రిలీజ్ మూడు సినిమాలు సెట్స్ మీదకు తీసుకెళ్లేలా ఉన్నారు. డిసెంబర్ కల్లా బిగ్ బాస్ పూర్తి అవుతుంది. ఆ తర్వాత ప్రవీణ్ సత్తారు సినిమా షెడ్యూల్ ప్లాన్ చేస్తారని తెలుస్తుంది. మొత్తానికి నాగార్జున కూడా సినిమాల వేగం పెంచారని చెప్పొచ్చు.
సీనియర్ హీరోల్లో చిరు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఏడాదికి రెండు మూడు సినిమాలతో ఫ్యాన్స్ ను అలరిస్తున్నారు.                                                 

మరింత సమాచారం తెలుసుకోండి: