
ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను వీపరితంగా ఆకట్టుకుంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో జరుగుతుంది. ఇందులో భాగంగా ఇటీవలే చిత్రయూనిట్ దుబాయ్ వెళ్లారు. ఉంటే.. తాజాగా లొకేషన్లో ఒక సరదా సన్నివేశాన్ని షేర్ చేశారు నితిన్.షాట్ గ్యాప్లో కీర్తి సురేష్ చక్కగా చెట్టు కింద కుర్చీ వేసుకుని ముఖం మీద కర్చీఫ్ వేసుకుని గుర్రుగా నిద్రపోతోంది. దాన్ని గమనించిన నితిన్ కీర్తి సురేష్ వెనుక నిలబడి వెంకీ అట్లూరితో కలిసి ఫొటో తీసుకున్నాడు. దాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. మేము కష్టపడి చెమటలు కక్కుతుంటే కీర్తి సురేష్ మాత్రం ఇలా రిలాక్స్ అవుతోంది అంటూ సెటైర్ వేశారు.
దీనికి స్పందించిన కీర్తి.. మీకు అసూయగా ఉంది కదా అంటూ రివర్స్ ఎటాక్ చేసింది. మొత్తానికి నితిన్ షేర్ చేసిన ఫొటో వైరల్‌గా మారింది.ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలై...ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ ను రాబట్టింది. వచ్చే సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం .ఇక ఈ సినిమా తర్వాత కీర్తీ సురేష్...మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది...!!