ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...దేశం గర్వంగా మెచ్చుకునే నటుడు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్. అయితే అతని మొదటి భార్య రీనా దత్త  కుమార్తె మాత్రం ఎప్పుడు వివాదస్పదమైన వార్తల్లో ఎప్పుడు నిలుస్తూనే ఉంటుంది. తాజాగా ఆమిర్ కుమార్తె ఐరా ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచింది. రీసెంట్‌గా తన మానసిక సమస్యలు, తనపై జరిగిన లైంగిక దాడి విషయాలను బయటపెడుతూ సంచలనం సృష్టించిన ఆమె.. తాజాగా డేటింగ్ వ్యవహారంతో జనం నోళ్ళలో నానుతోంది. తన ఫిట్‌నెస్ ట్రైనర్‌తో ఆమె ప్రేమాయణం నడుపుతుండటం బీ టౌన్ వర్గాల్లో హాట్ ఇష్యూగా మారింది. గతంలో ఓ వ్యక్తిని ప్రేమించి అతనితో బ్రేకప్ చేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు ఫిట్‌నెస్ ట్రైనర్‌ నుపూర్ శిఖారెతో డేటింగ్ చేస్తోంది ఐరా ఖాన్.


దీని పై నెటిజనులు ఆమెపై కోపంతో నోరు పారేసుకుంటున్నారు. ఛీ ఛీ నీకు సిగ్గు లేదా..! అంత పెద్ద స్టార్ కడుపున పుట్టి ఆయన పరువు తీస్తావా..! అంటూ సోషల్ మీడియాలో తిడుతున్నారు.ఇక వీరి ప్రేమ వ్యవహారం ఎలా మొదలైందంటే...ఆమిర్‌ఖాన్ జిమ్ ట్రైనర్ అయిన నుపూర్ లాక్‌డౌన్ సమయంలో ఐరా చేత కూడా వర్కవుట్స్ చేయిస్తూ స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చాడట. ఆ సమయంలోనే వీరి ప్రేమ చిగురించినట్టు సమాచారం. గత 6 నెలలుగా వీరి మధ్య అఫైర్ నడుస్తుందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే వీటిపై రియాక్ట్ అయిన ఐరా.. గతంలో మాదిరిగా తన రిలేషన్ గురించి పబ్లిక్‌గా మాట్లాడను అని తెలిపింది.


ఐరా ఖాన్- నుపూర్ శిఖారె ప్రేమకు ఐరా తల్లి రీనా దత్తా ఆమోదం లభించిందట. అలాగే మహాబలేశ్వరంలోని ఆమీర్ ఖాన్ ఫామ్‌హౌస్ లోనే కొన్ని రోజులు సన్నిహితంగా గడిపారట. స్నేహితులతో పార్టీలు కూడా అక్కడే చేసుకుంటున్నట్లు టాక్. సినీ గడప తొక్కకముందే అఫైర్లతో ఇలా ఫేమస్ అవుతోంది ఐరా ఖాన్. ఇక నూపూర్ విషయానికొస్తే.. బాలీవుడ్‌లో పలువురు స్టార్లకు ఫిట్‌నెస్ ట్రైనర్‌గా ఉన్నారు. సుస్మితా సేన్‌కు గత పదేళ్లుగా ట్రైనర్‌గా ఉన్నారు. ఈ విషయం పై ఆమిర్ ఫ్యాన్స్ ఐరా పై బాగా కోపంగా ఉన్నారట.. సోషల్ మీడియా వేదికగా పలు రకాల కామెంట్లతో ఐరా పై తెగ విరుచుకుపడుతున్నారు.ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి: