దేశానికి ‘బాహుబలి’తో బిగ్ మూవీస్ అంటే ఎలా ఉండాలో చూపించిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. అటువంటి దర్శకుడితో కలిసి యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం `ఆర్ఆర్ఆర్`. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ హీరోలిద్దరూ గతంలో రాజమౌళితో నటించిన వారే. రాజమౌళి - రామ్ చరణ్ కాంబోలో వచ్చిన ‘మగధీర’ ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. అలాగే రాజమౌళి - తారక్ కాంబినేషన్‌లో ఇప్పటికే ‘స్టూడెంట్ నెం.1’, ‘సింహాద్రి’, ‘యమదొంగ’ వంటి భారీ హిట్లు ఉన్నాయి.

రాజమౌళితో ఇన్ని సార్లు నటించిన హీరో మరెవరూ లేరు. ఈ క్రమంలో ఇలాంటి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు హీరోలకు తోడు ‘బాహుబలి’ డైరెక్టర్‌తో సినిమా వస్తుండటంతో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రంపై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అది కూడా ‘బాహుబలి’ సిరీస్‌తో రాజమౌళి మాయ చేసిన తర్వాత అతను దర్శకత్వం వహిస్తుంది ఈ సినిమాకే కావడంతో అందరూ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్ కూడా సమయానికి తగ్గట్లు వస్తూ అభిమానులను అలరిస్తున్నాయి. రామ్‌చరణ్ జన్మదినోత్సవం సందర్భంగా మార్చిలో `భీమ్ ఫర్ రామరాజు` వీడియో విడుదలైంది. అది అప్పట్లో యూట్యూబ్‌లో దుమ్ము రేపింది. ఈ వీడియోలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ కనువిందు చేశారు.


అలాగే దసరా సందర్భంగా విడుదలైన `రామరాజు ఫర్ భీమ్` కూడా ఎన్నో రికార్డులు తిరగ రాస్తోంది. దీనిలో కొమరం భీమ్‌గా తారక్ పాత్ర రివీల్ అయింది. ఈ వీడియో ఇప్పటికీ సరికొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉంది. తాజాగా ఈ వీడియో మరో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకుంది. అక్టోబర్ 22న విడుదలైన ఈ వీడియోపై ఇప్పటివరకు 2 లక్షల మందికిపైగా కామెంట్లు చేశారు. ఈ స్థాయిలో కామెంట్లు వచ్చిన టీజర్ టాలీవుడ్‌లో ఇప్పటివరకు మరోటి లేదు. అలాగే ఈ వీడియోను ఇప్పటివరకు 3 కోట్ల మందికి పైగా చూశారు. 11 లక్షలపైగా లైకులు కూడా ఈ వీడియోకు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: