సీరియల్ హీరోలకు సినీ హీరోల
కన్నా ఎక్కువ క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే.. ఈ మేరకు వారికి ఫేమస్ తో పాటుగా విమర్శలు కూడా ఎక్కువగానే అందుతున్నాయి..అలాంటి వాళ్ళల్లో ఒకరు బుల్లి తెర
శోభన బాబు నిరూపం. చాలా సీరియల్స్ లో నటించిన కూడా ఇప్పుడు ప్రసారం అవుతున్న కార్తీక దీపం సీరియల్ ద్వారా బాగా ఫేమస్ అయ్యారు. అంతకన్నా విమర్శలు కూడా అందుకున్నారు. తాజాగా విమర్శలు చేసే వారికి తన దైన శైలిలో బుద్ది చెప్పాడు.
ఆయన ఒక ఇంటర్వ్యూ లో 'బ్యాగ్రౌండ్' గురించి మాట్లాడుతూ, అందరూ అనుకుంటారు నాకు యాక్టింగ్ రాదు, మా
నాన్న గారి పేరు యూస్ చేసుకుని నేను
ఇండస్ట్రీ లోకి వచ్చాను. బ్యాగ్రౌండ్ ఉంది కాబట్టే ఛాన్స్‌లు ఇస్తున్నారు అని. ఆలా అనుకునేవారందరికి నా సమాధానం ఒక్కటే… ఒకవేళ వారు అనుకునేదే నిజమయితే నేను ఒకటి రెండు సీరియల్స్ చేసి కనుమరుగై పోయేవాడిని. ఇన్ని సీరియల్స్ లో నటించాల్సిన అవసరం లేదు. నాకు అన్నీ ఆఫర్లు కూడా ఇవ్వరు. నటన రాకుంటే ఛాన్సులు రావన్న సంగతిని గమనించాలని
డాక్టర్ బాబు అన్నారు.
ఇండస్ట్రీ లో
సక్సెస్ వెనుక కష్టం ఎలా ఉంటుందో, అలాగే రూమర్స్ కూడా ఉంటాయి. అందులో ఇది కూడా ఒక రూమర్ కావచ్చు. ఎప్పుడైనా, ఎక్కడైనా బ్యాగ్రౌండ్ అనేది ఎంట్రీ వరకే ఉపయోగపడుతుంది. ఆ తరువాత కష్టపడి నిలదొక్కుకోవాలి. ఇక్కడ ఉన్న కాంపిటీషన్ లో టాలెంట్ ఉంటేనే నిలబడగలం. లేక పోతే బ్యాగ్రౌండ్ ఎందుకు పనికిరాదు. అలాగే ఇండస్ట్రీలో ఎదుటివారికి మనతో పని ఉంది అంటేనే అందరూ ఉంటారు.. అవసరం లేకుంటే దగ్గరకు కూడా రారు. మా
నాన్న ఉన్నప్పుడు అందరూ నాతో ఉన్నారు.. ఆయన చనిపోయాక నన్ను అందరూ వదిలేశారు.తన మీద ఉన్న రూమర్స్ కు మొత్తానికి
చెక్ పెట్టారు..