ప్రిన్స్ మహేష్ బాబు  గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే మహేష్ బాబు ఒక మంచి నటుడు మాత్రమే కాదు గొప్ప వ్యక్తిత్వం కలవాడు కూడా. అందుకే ఆయనని సూపర్ స్టార్ అని అంటారు అందరు.మన  టాలీవుడ్ హీరోలలో తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న హీరో మహేష్. ఇప్పుడున్న టాలీవుడ్ హీరోలకి ఈ మాత్రం తీసిపోకుండా ఉంటాడు మహేష్. ఆరడుగుల అందగాడు, పట్టుకుంటే కందిపోయేలా ఉండే స్కిన్ టోన్ టోటల్ గా ఆయన్ని చూసి అమ్మాయిలు సైతం కుళ్ళుకునేలా ఉంటాడు మహేష్ బాబు.ఆయనతో నటించడానికి ఎంతోమంది   హీరోహీరోయిన్లు ఎదురు చూస్తూ ఉంటారు. కేవ‌లం మన టాలీవుడ్ లోనే కాదు అన్ని ఇండ‌స్ట్రీల్లోనూ మ‌హేష్ బాబు అందానికి, నటనకి ఫిదా అయిన  అభిమానులు ఉన్నారు. ఆడవాళ్లు సైతం మహేష్ బాబు అంటే పడి చస్తారు..ఇద్దరు పిల్లలు ఉన్నాగాని ఆయన అందం మాత్రం ఏ మాత్రం చెక్కు చెదర లేదు. ఇప్పుడు చుసిన గాని 20 ఏళ్ల కుర్రాడిలాగానే కనిపిస్తాడు.

అసలు అంత అందాన్ని ఎలా మెయింటైన్ చేస్తాడో అని అందరిలో ఒక ప్రశ్న మెదులుతూ ఉంటుంది కదా.. అయితే సూప‌ర్‌స్టార్ ఇంత అందంగా క‌నిపించ‌డానికి సీక్రెట్ ఏంటో తెలిసిపోయింది. అసలు మ‌హేష్ బాబు అందం వెనుక  ఎవ‌రు ఉన్నారో కూడా తెలిసిపోయింది. స్వయంగా ఈ విష‌యాన్ని ఆయనే బయట పెట్టారు. తాజాగా త‌న ఇంస్టాగ్రామ్ స్టోరీలో తెలిపారు. తాజాగా ఓ ఫొటోను షేర్ చేస్తూ.. మ‌హేష్ బాబు మై స్కిన్ స్పెష‌లిస్ట్ అని కామెంట్ పెట్టారు. మ‌హేష్ అందానికి కార‌ణ‌మైనఆ  డాక్ట‌ర్ పేరు ర‌ష్మి శెట్టి.ఈవిడ  క‌ర్ణాట‌క‌కు చెందిన డాక్టర్. అయితే  ర‌ష్మికి డెర్మ‌టాలజిస్ట్‌గా మంచి పేరు, ప్రఖ్యాతలు ఉన్నాయి.

అంతేకాదు ప్ర‌స్తుతం ముంబ‌యిలో ప‌లువురు సెల‌బ్రిటీల‌కు కూడా ఆమె డెర్మ‌టాల‌జిస్ట్‌గా ప‌నిచేస్తున్నారు. అలాగే డాక్టర్ రష్మీ బాలీవుడ్‌కి చెందిన ప‌లువురు ప్ర‌ముఖుల‌కు  ప‌ర్స‌న‌ల్ డెర్మ‌టాల‌జిస్ట్‌గా ప‌నిచేస్తున్నారు. ఏ డాక్టర్ సలహాలు, సూచనలు మేరకు మహేష్ బాబు తన స్కిన్ అందాన్ని కాపాడుకుంటున్నారు అన్నమాట. అందుకే మహేష్ బాబు ఏ వయసులో కూడా యోంగ్ అండ్ డైనమిక్ హీరోలుగా కనిపిస్తున్నాడు. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు  స‌ర్కారు వారి పాట‌ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీలో మ‌హేష్ మీసాలు లేకుండా, కాస్త జులుపాల జుట్టుతో క‌నిపించ‌నున్నారు.ఈ సినిమాలో  మహేష్ బాబు లుక్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: