ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తరువాత ఇండియన్ జేమ్స్ కామెరూన్ శంకర్ తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇక ఎప్పుడైతే శంకర్ తో సినిమా ప్రకటించాడో అప్పటినుంచి వీరి సంబంధించిన ప్రతి వార్త సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది..ఇక ఈ సినిమాని దిల్ రాజు నిర్మించబోతున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో వస్తోన్న 50వ సినిమా ఇది.పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో దీన్ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడు దిల్ రాజు. అందుకే రెమ్యునరేషన్ విషయంలో కూడా రాజీ పడడం లేదు. దర్శకుడు శంకర్ తో చర్చించిన అనంతరం దిల్ రాజు ఈ సినిమాకి రూ.150 కోట్ల బడ్జెట్ కేటాయించాలని నిర్ణయించుకున్నాడట.ఇందులో చాలా వరకు నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్ కే సరిపోతుంది. కానీ ఇంత మొత్తంలోనే సినిమా తీయాలని దిల్ రాజు ఫిక్స్ అయ్యాడు. అదే విషయాన్ని శంకర్ కి కూడా చెప్పినట్లు తెలుస్తోంది.ఈ సినిమాకి వస్తోన్న హైప్ చూస్తుంటే రూ.150 కోట్లు రికవర్ చేయడం పెద్ద కష్టమేమీ కాదనిపిస్తుంది.
పైగా దర్శకుడు శంకర్ సినిమాలకు సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇక రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' సినిమాతో తన పాపులారిటీ మరింత పెంచుకుంటాడని.. కాబట్టి తన తదుపరి సినిమాకి క్రేజ్ రావడం ఖాయమని నమ్ముతున్నారు. ఈ సినిమా డిజిటల్, శాటిలైట్స్ రూపంలోనే వంద కోట్లు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.ఇక రామ్ చరణ్ ఈ సినిమాకి వస్తోన్న హైప్ చూస్తుంటే రూ.150 కోట్లు రికవర్ చేయడం పెద్ద కష్టమేమీ కాదనిపిస్తుంది. పైగా దర్శకుడు శంకర్ సినిమాలకు సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా మంచి క్రేజ్ ఉంది.
ఇక రామ్ చరణ్, శంకర్ క్రేజ్ వల్ల సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్మకంతో దిల్ రాజు అంత బడ్జెట్ పెడుతున్నాడట. కాని శంకర్ గురించి తెలిసిందేగా బడ్జెట్ సరిపోకపోతే ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టిస్తాడు. మరి దిల్ రాజు ఎలా నీలదొక్కుకుంటాడో ఏమో చూడాలి. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి....
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి