అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తాజాగా  బీజేపీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ నేత విజయశాంతి తదితరులు హాజరయ్యారు. కరోనా వారియర్స్ అయిన మహిళలను ఈ సందర్భంగా సత్కరించారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ.. మహిళలకు మోదీ ప్రభుత్వం ఎంతో మేలు చేస్తోందన్నారు. ఎక్కడ మంచి జరిగినా అక్కడ బీజేపీ ఉంటోందన్నారు. సమాజంలో చెడుని కూడా క్లీన్ చేయాలి(పారిశుద్ధ్య కార్మికుల నుద్దేశించి) విజయశాంతి పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరటం లేదని.. బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు మేలు జరుగుతుందన్నారు.

ఈ సందర్భంగా విజయశాంతికి, కార్మికులకు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.మాస్క్ తీయమని.. తీస్తే విజయశాంతినా? కాదా? అనేది పోల్చుకోగలుగుతామని పారిశుద్ధ్య కార్మికులు రాములమ్మను అడిగారు.మాస్క్ తీసి ఇప్పుడు ఓకేనా అని విజయశాంతి అడిగారు. ఓకే అన్న కార్మికులు.. మీరంటే మాకు బాగా ఇష్టమని... రాములమ్మ సినిమా నాలుగు సార్లు చూశామని వెల్లడించారు.ఇంకా ఏయే సినిమాలు చూశారని కార్మికులను విజయశాంతి అడిగారు. చాలా సినిమాలు చూశామని.. మీ సినిమాలు చూస్తే ధైర్యం వస్తుందని విజయశాంతికి తెలిపారు.

మిమ్మల్ని తమ అక్కగానో, చెల్లెలుగానో భావిస్తామని విజయశాంతితో పారిశుద్ధ్య కార్మికులు తెలిపారు...తన సినీ కెరీర్ లో ఎంతో మంది అగ్ర హీరోల సరసన హీరోయిన్ గా మెరిసిన విజయశాంతి.. నటనలో వారందరికీ పోటీనిచ్చేలా నటించి లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకుంది.. ఇక అదే సమయంలో కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా మెప్పించిన ఈమె చాలా గ్యాప్ తర్వాత ఇటీవలే మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చింది విజయశాంతి..ఆ సినిమాలో మంచి నటనను కనబర్చిన ఈమె ఇకపై సినిమాల్లో నటించనని చెప్పినప్పటికీ.. మంచి పాత్రలు వస్తే చేసే ఆలోచనలో ఉన్నట్లు గా ఇటీవలే ఓ సందర్భంలో తెలిపింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: