నవదీప్... హాట్టు కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాడు. ఆ మధ్య మల్టీ స్టారర్ అన్నాడు... మరొకటి అన్నాడు... ఏదన్నా సరే జనాలు నచ్చలేదన్నారు. అయితే, తాజా చిత్రం ‘వసూల్ రాజా’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారన్న ధీమాతో ఉన్నాడు నవదీప్. ప్రేక్షకుల ఆదరాభిమానాలు ఎలా ఉంటాయన్నది కాసేపు పక్కన బెడితే... ఈ సినిమా విజయాన్ని బట్టే నవదీప్ భవితవ్యం తేలుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ మధ్యనే ఒకరిద్దరు నిర్మాతలు నవదీప్ తో సినిమా చేసేందుకు సిద్ధపడినా... ‘వసూల్ రాజా’ వసూళ్లు చూశాకనే మనోడిని అప్రోచ్ కావడం బెటర్ అని కాస్త వెనకడుగు వేశారట. ఇలా లోలోప అనుకుంటున్నవారు ఇంకెందరో మరి. ఏదేమైనా ఇది నవదీప్ అవకాశాలకు ఈ చిత్రమే ఓ మైలురాయి అంటున్నారు విశ్లేషకులు. డబ్బే ప్రధానం అనే కాన్సెప్టుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం నవదీప్ కి ఏమేరకు సక్సెస్ ని ఇస్తుందో మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: