తెలుగు సినిమా పరిశ్రమ లో ఈ ఏడాది చాలానే భారీ సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇక గత ఏడాది డిసెంబర్ తరువాత థియేటర్లు తెరుచుకోవడం, అలానే ఒకదాని వెంట మరొకటి సినిమాలు రిలీజ్ అవుతూ ఉండడం చూస్తున్నాం. ఇక ఇటీవల వస్తున్న సినిమాల్లో కొన్ని అక్కడక్కడా మంచి విజయాన్ని అందుకుని, బయ్యర్లకు, నిర్మాతలకు కాసులు కురిపిస్తున్నాయి.

అయితే ఈ ఏడాది ముఖ్యంగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న భారీ పాన్ ఇండియా సినిమాల్లో కెజిఎఫ్ చాప్టర్ 2, పుష్ప, లైగర్, ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ ఉండగా రాబోయే ఏడాది సంక్రాంతి సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ హరి హర వీరమల్లు విడుదల కానుంది. వీటిలో మెజారిటీ ప్రేక్షకుల దృష్టి ఆర్ఆర్ఆర్ పైనే ఉందని చెప్పాలి. బాహుబలి 2 తరువాత రాజమౌళి తీస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ తప్పకుండా అతి పెద్ద విజయాన్ని అందుకుంటుందని ప్రేక్షకాభిమానులు అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో తొలిసారిగా మెగా నందమూరి హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తుండడం కూడా దీనిపై ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పడడానికి మరొక కారణం. 

ప్రస్తుతం క్లైమాక్స్ సీన్స్ చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా దసరా పండుగ కానుకగా అక్టోబర్ 13 న విడుదల కానుంది. అయితే ఈ సినిమా యొక్క నాన్ థియేట్రికల్ హక్కులకు సంబంధించి ప్రస్తుతం పలు ఛానల్స్ ప్రయత్నిస్తున్నాయని, అయితే నిర్మాత దానయ్య మాత్రం వాటి ధర ఎంతో భారీ చెప్తున్నారని అంటున్నారు. అలానే క్రిష్ దర్శకత్వంలో ఏ ఎమ్ రత్నం నిర్మాతగా పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిస్తున్న హరి హర వీరమల్లు రైట్స్ కూడా ఎంతో భారీగా పలుకుతుండడంతో, వాటి పేర్లు చెపితేనే సదరు ఛానళ్ల వారు అంత ఎక్కువ ధర పెట్టి కొనడానికి భయపడుతున్నారని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే....!!!

మరింత సమాచారం తెలుసుకోండి: