ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్2 ఎంతటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసినదే. ఈ సినిమాకు సీక్వెల్ గా ఎఫ్ 3 లో కూడా తమన్నా నటిస్తున్నారు. అదేవిధంగా "సత్యదేవ్","గుర్తుందా సీతాకాలం"వంటి సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఒకవైపు సినిమాలలో నటిస్తూ మరోవైపు వెబ్ సిరీస్ లో చేస్తూ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతుంటారు.
తాజాగా ఈ మిల్క్ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా ఒక ఫన్నీ వీడియోను షేర్ చేసి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. షూటింగ్ సెట్లో ఖాళీగా ఉన్న సమయంలో తమన్నా ఈ విధంగా ఫన్నీ వీడియోను చిత్రీకరించి తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ అభిమానులను సర్ ప్రైజ్ చేసింది. ఈ వీడియోలో తమన్నా మూతికి మీసం పెట్టుకొని పాట పాడుతూ ఎంతో సందడి చేస్తున్నారు. ఈ వీడియోను షేర్ చేస్తూ...దీనికి 'టాకింగ్ మాణిక్కం, వాకింగ్ మాణిక్కం, సింగింగ్ మాణిక్కం' అంటూ కామెంట్ పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మంది నెటిజన్లను ఆకట్టుకుంది. మరి ఇంకెందుకు ఆలస్యం తమన్నా ఆ ఫన్నీ వీడియోను మీరు ఓ లుక్కేయండి
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి