ఆ తరువాత అమితాబ్, జితేంద్ర, ధర్మేంద్ర వంటి అగ్రనటులతో నటించి అక్కడ తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాదాపు ఎనిమిది భాషల్లో తన నటతో అందరిని ముగ్దులను చేసింది జయప్రద. హిందీలో జితేంద్రతో ఎక్కువ సినిమాల్లో కలిసి నటించిన జయప్రద. సినీ రంగంలోనే కాకుండా ఎన్టీఆర్ ప్రోత్సాహంతో రాజకీయ రంగంలో అడుగు పెట్టి రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసింది జయప్రద.
ఆ తరువాత ఉత్తరప్రదేశ్ కు చెందిన సమాజ్ వాదీ పార్టీలో జాయిన్ అయ్యి అక్కడి నుంచి రాంపూర్ లోక్ సభ సభ్యురాలిగా ఎన్నికైంది. ప్రస్తుతం ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయి అమర్ సింగ్ రాష్ట్రీయ లోక్ మంచ్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. తన అందం అభినయంతో ఎంతో మంది ప్రేక్షకాభిమానం అందుకుంది జయప్రద. నటిగా కాకుండా రాజకీయ నాయకురాలిగా కూడా సక్సెస్ సాధించింది.
ఇలా వెండితెరపై కాకుండా రాజకీయ యవనికపై రాణిస్తున్న జయప్రదకు మరోక్క సారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుదాం.జయప్రద అంటే ఒక సుందరమైన సౌందర్యవంతమైన రూపం. ప్రేక్షకులు అలానే కోరుకున్నారు. ఆమె నేటికీ అలానే ఉన్నారు. ఇప్పుడు ఆమె ఒక తెలుగు సినిమాలో నటిస్తున్నారు. మరోసారి జయప్రద జయప్రదంగా మన ముందుకు రావాలని కోరుకుందాం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి