పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు వింటే చాలు అభిమానుల్లో ఎక్కడ లేని పూనకాలు వస్తాయి. ఈ పేరుకి పెద్ద పరిచయం అక్కర్లేదని చెప్పాలి.అలాగే పవన్ కళ్యాణ్ మీద ఉన్న ఇష్టాన్ని ఇప్పటికే ఎంతో  బయట పెట్టేశారు. ఈ క్రమంలోనే తెలుగు స్టార్ యాంకర్ శ్రీముఖితో పాటు ప్రముఖ నటి భానూ శ్రీ కూడా బయట పెట్టారు.  ఇందుకోసం బండ్ల గణేష్‌ను వాడుకున్నారు. ఆ వివరాలు మీకోసం! చాలా గ్యాప్ తర్వాత ‘వకీల్ సాబ్'తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్.శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించాడు. బాలీవుడ్‌లో బంపర్ హిట్ అయిన ‘పింక్'కు ఇది రీమేక్‌గా వస్తోంది.వకీల్ సాబ్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది.  



దీనికి చిత్ర యూనిట్‌తో పాటు ఎంతో మంది దర్శకులు, నిర్మాతలు, సన్నిహితులు హాజరయ్యారు. ఇందులో పవన్ కల్యాణ్ స్పీచ్ ఆకట్టుకుంది. అలాగే, అభిమానులు కూడా ఈ వేడుకలో తెగ ఎంజాయ్ చేస్తూ కనిపించారు.ఆదివారం అంగరంగ వైభవంగా జరిగిన ‘వకీల్ సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు.స్వతహాగా పవన్  కల్యాణ్‌కు భక్తుడు. స్టేజ్ ఎక్కితే మాములుగా ఉంటుందా మరి.  ఉద్వేగంగా మాట్లాడుతూ ఆడిటోరియంలో ఉన్న ఫ్యాన్స్ అందరిలోనూ ఉత్సాహాన్ని నింపాడు. మరీ ముఖ్యంగా పవన్‌పై ఉన్న ప్రేమను చాటేందుకు పద్యాన్ని కూడా పాడుకున్నాడు.వకీల్ సాబ్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సినీ ఇండస్ట్రీలోనే సరికొత్త చరిత్రను సృష్టించింది. 




ఈ ఫంక్షన్‌ను ఏక కాలంలో 1.30 లక్షల మంది లైవ్ ద్వారా తిలకించారు. ఇదే క్రమంలోనే ఈ ఫంక్షన్‌ను బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి, హీరోయిన్ కమ్ యాంకర్ భానూ శ్రీ ఇద్దరూ కలిసి టీవీలో చూశారు. దాన్ని ఇంటర్నెట్‌ ద్వారా చెప్పారు. రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ కనిపించినప్పుడల్లా అటు శ్రీముఖి, ఇటు భానూ శ్రీ ‘పవర్ స్టార్ పవర్ స్టార్' అంటూ టాప్ లేచిపోయేలా కేకలు వేశారు. అంతేకాదు, టీవీ స్క్రీన్ మీద పవర్ స్టార్ కనిపించేలా సెల్ఫీలు కూడా దిగారు. అలా పరోక్షంగా పవన్ కల్యాణ్‌తో కలిసి రచ్చ రచ్చ చేశారు ఈ ఇద్దరు భామలు. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ముఖ్యంగా ‘ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా' అంటూ బండ్ల గణేష్  డైలాగ్‌నే వాడుతూ శ్రీముఖి, భానూ శ్రీ ఓ సెల్ఫీ వీడియోను రూపొందించారు. దీని ద్వారా పవన్‌పై ఉన్న అభిమానాన్ని చాటాడు. !!









మరింత సమాచారం తెలుసుకోండి: