పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం " వకీల్ సాబ్ ". దాదాపుగా మూడేళ్లు వెండి తెరకు దూరమైన పవన్ మళ్ళీ ఈ సినిమా తో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా నేడు ( ఏప్రెల్ 9) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవన్ రీఎంట్రీ సినిమా కావడంతో పవన్ అభిమానులు భారీ ఎత్తున థియేటర్ల వద్ద హంగామా చేశారు. దీంతో ఎక్కడ చూసిన పండగ వాతావరణం నెలకొంది. ఇక సినిమా మొదటి బెన్ ఫిట్ షో నుండే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మూవీ లో పవన్ పర్ఫామెన్స్ కు అభిమానుల కాక కామన్ ఆడియన్స్ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. 

దీంతో ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ కలెక్షన్లతో థియేటర్లు హోరెత్తిపోతున్నాయి. ఇక సినీ ప్రముఖులు కూడా సినిమా సూపర్ అంటూ ట్విట్టర్ లో స్పందిస్తున్నారు. తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా " వకీల్ సాబ్ " పై స్పందించారు. సినిమా సూపర్ అంటూ చిత్రయూనిట్ కి అభినందనలు తెలిపారు. డైరెక్టర్ వేణు శ్రీరామ్ చక్కగా తీశాడని, సినిమా బ్యాక్ గ్రాండ్ స్కోర్ చాలా బాగుందని సుకుమార్ వ్యాఖ్యానించారు.

 " వకీల్ సాబ్ " సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ఇక అందరి దృష్టి ఫస్ట్ డే కలెక్షన్ల పై పడింది. ఫ్లాప్ సినిమాలతోనే దిమ్మతిరిగే కలెక్షన్లు రాబట్టే పవన్ ఇక సినిమా హిట్ అయితే ఆ కలెక్షన్ల లెక్క ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ సినిమాలలో ఇప్పటి వరకు ఓపెనింగ్స్ పరంగా " అజ్ఞాత వాసి " సినిమా టాప్ కలెక్షన్లు సాధించింది. అయితే " అజ్ఞాత వాసి " ఫ్లాప్ టాక్ తోనే భారీ కలెక్షన్లు రాబట్టింది. కాగా "వకీల్ సాబ్ " ఫస్ట్ షో నుండే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ఓపెనింగ్స్ లో సరికొత్త రికార్డులు సెట్ చెయ్యడం ఖాయంగా కనిపిస్తుంది.      .


మరింత సమాచారం తెలుసుకోండి: