బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ సంస్కృతి ఏ లెవెల్లో ఉందో వెల్లువెత్తుతున్న ఆరోపణలు చూస్తుంటే అర్థమవుతుంది. ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలు తమకు జరిగిన అన్యాయాలు బయటకి చెప్పగా రోజుకొకరు తమపై జరిగిన అన్యాయాల్ని బయటపెట్టడంతో ఇండస్ట్రీలో ఇన్ని దారుణంలు జరుగుతున్నాయా అని అనిపిస్తుంది. ఇప్పటితరం నటీమణులు కాదు పాత తరం నటీమణులు సైతం గొంతెత్తి తమపై జరిగిన లైంగీక దాడులను చెప్తున్నారు.

గతంలో లేని ఇప్పుడు వచ్చిందంటే వారు ఎంతటి బాధను అనుభవించారో అర్థం చేసుకోవచ్చు. గతంలో సొసైటీ గురించి, పరువు, మర్యాదల గురించి ఆలోచించినా ఇప్పుడు వాటిని పట్టించుకోకుండా తమకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకుంటున్నారు.. రాబోయే తరానికి లైన్ క్లియర్ చేస్తున్న వీరి చర్యలు హర్షణీయం..  దర్శక నిర్మాతల అఘాయిత్యాలను ధైర్యంగా చెప్పడం ఒకరకంగా మంచిదే అయినప్పటికీ పెద్ద పెద్ద హోదాల ఉన్న నటులు, నిర్మాతలు, దర్శకులు కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ లో భాగం అయినందుకు ఎలా రియాక్ట్ అవ్వాలో ప్రేక్షకులకు తెలీట్లేదు.. బయటకి చెప్పలేని విధంగా తమపై లైంగీక దాడి చేశారని నటీమణులు చెప్తుంటే వాళ్ళని ఏం చేస్తే సినిమా ఇండస్ట్రీ పై ఉన్న మరక చెరిగిపోతుందో అర్థం కావట్లేదు.

ఇలాంటివాటిని తాను అస్సలు సహించబోను అని చెప్తుంది చిన్మయి.. తాజాగా తల్లి తండ్రులపై కొన్నిసంచలన వ్యాఖ్యలు చేసింది చిన్మయి.ఒక తల్లి కూతురు ను తన తండ్రితో ఎఫైర్ నడిపితుందని తెలిసి హింసిస్తుందట.. అది విషయం చిన్మయి కి తెలిసి ఇలాఅంది..వారు మనల్ని వారు కన్నారు కదా? అని అన్నీ భరించాల్సిన పని లేదు. మనకు ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చే వరకు అలాంటివి తప్పవు. కానీ ఇండియాలో అది జరగదు. చదువులు అయినా కాకపోయినా వెంటనే పెళ్లిళ్లు చేసేస్తారు.. ఆ వెంటనే పిల్లల్ని కనాల్సి వస్తుంది.. అందుకే ఇలాంటి వాతావరణంలో అలాంటి తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఉంటే.. మంచివాడిని చూసుకుని భర్తగా ఎంచుకోవాలి. అలా తిట్టడం మరీ దారుణం అని చిన్మయి చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: