
ఈ మధ్యకాలంలో వచ్చిన బెస్ట్ కామెడీ మూవీస్ లో జాతి రత్నాలు సినిమా ఒకటీ. చిన్న చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి, పెద్ద విజయాన్ని సాధించింది ఈ సినిమా. కామెడీ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రాలలో జాతిరత్నాలు సినిమా ముందువరుసలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్ లో దుమ్ము లేపిన జాతిరత్నాలు. ఓటీటీలో కూడా దూసుకుపోతోంది. సినీ ఇండస్ట్రీలోని సెలబ్రెటీలు కూడా ఈ సినిమాకు మంచి మార్కులు వేశారు.
కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా కి బాగానే వచ్చాయి. వన్ లో టీమిండియా వెటరన్ వికెట్ కీపర్, కోల్ కత్తా నైట్ రైడర్స్ వైస్ కెప్టెన్ దినేష్ కార్తీక్ కూడా జాతిరత్నాలు సినిమాపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సినిమా బాగుందని, డైలాగ్ సూపర్ అని ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా నటించారని డీకే పేర్కొన్నాడు. దీంతో ఇతనికి తెలుగు కూడా వచ్చు అన్న విషయం తెలిసింది..
నేను ఎంతగా నవ్వాను అంటే, నవ్వి నవ్వి కళ్ళల్లో నుంచి నీరు వచ్చాయి. అంతలా నవ్వాను అని చెప్పుకొచ్చాడు దినేష్ కార్తీక్. సినిమాలో అద్భుతమైన డైలాగ్స్ ఉన్నాయి. సూపర్ డైరెక్షన్ ప్రతి ఒక్కరు అద్భుతంగా నటించారు. జాతి రత్నాలు సినిమా మంచి ఉల్లాసాన్ని ఇచ్చిందని కూడా చెప్పాడు. ఇలా నవ్వించడం చాలా కష్టం. కానీ మీరు బాగా చేశారు. మీరు వెండి తెరపై ఎంత కష్టపడ్డారో తెలుస్తోంది అని చెప్పుకొచ్చాడు. ఓవరాల్ గా అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అని దినేష్ కార్తీక్ ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చాడు. అయితే ఇటీవల కేటీఆర్ కూడా జాతిరత్నాలు పై ప్రశంసల వర్షం కురిపించాడు.
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో బంపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రాన్ని మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించాడు. ఈ సినిమా టీజర్ ట్రైలర్ తోనే ప్రేక్షకులకు చాలా దగ్గరైనట్లు తెలుస్తోంది. అయితే ఎట్టకేలకు క్రికెటర్లు కూడా సినిమాలు చూస్తారనే విషయం తెలిసింది.