చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరో, హీరోయిన్స్ ఉన్నారు. కానీ అందులో కొంత మంది హీరో హీరోయిన్ కాంబినేషన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇక అందులో కొంత మంది హీరో హీరోయిన్లు ఒకటి కంటే ఎక్కువ సినిమాల్లో కలిసి నటించారు. అలా నటించిన వారిలో కొంత మంది హిట్ కాంబినేషన్స్ గా గుర్తింపు పొందారు. అలా హిట్ పెయిర్ గా గుర్తింపు పొందిన కాంబినేషన్స్ లో ఒక కాంబినేషన్ విక్టరీ వెంకటేష్, సౌందర్య. వెంకటేష్ సౌందర్య కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. ఆ సినిమాలు ఏవో అందులో ఎన్ని హిట్ సాధించాయో ఇప్పుడు చూద్దాం.

అసలు వెంకటేష్, సౌందర్య కాంబినేషన్ అంటే చాలా మందికి గుర్తొచ్చే సినిమా రాజా. ముప్పలనేని శివ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. వెంకటేష్, సౌందర్య కాంబినేషన్ లో వచ్చిన మరొక సినిమా పవిత్ర బంధం. ఈ సినిమాకి ముత్యాల సుబ్బయ్య గారు దర్శకత్వం వహించారు. ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  

ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మరో సినిమా పెళ్లి చేసుకుందాం. ఈ సినిమాను ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమా కూడా హిట్ సాధించింది. 2000 సంవత్సరంలో వచ్చిన ఈ సినిమాకి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మరొక హీరోయిన్ అంజలా జవేరి నటించారు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

వెంకటేష్, సౌందర్య కాంబినేషన్ లో వచ్చిన మరో సినిమా జయం మనదేరా. ఈ సినిమాలో వెంకటేష్ డబుల్ రోల్ లో నటించారు. ఇందులో ఒక వెంకటేష్ కి పెయిర్ గా సౌందర్య నటించారు. మరొక వెంకటేష్ కి పెయిర్ గా భాను ప్రియ నటించారు. ఈ సినిమాకి ఎన్.శంకర్ దర్శకత్వం వహించారు. ఇక ఇప్పటికి వీరిద్దరి కాంబినేషన్ లో ఏదైనా సినిమా ఈటీవీలో వస్తే చాలు ప్రేక్షకులు అలాగే చూస్తూ ఉండిపోతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: