ఇందులో ప్రతి ఒక్క సన్నివేశం హైలైట్ గా నిలిచాయి. సాంగ్స్ అయితే ఈ సినిమాను వేరే లెవెల్ కి తీసుకెళ్లింది అని చెప్పవచ్చు. ఆ తరువాత మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా డియర్ కామ్రేడ్. ఇందులో కూడా వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు, కథ అంతా బాగున్నా ఎందుకో తెలుగు ప్రేక్షకులు దీనిని ఆదరించలేకపోయారు. ఆ తరువాత రెండు సంవత్సరాలు తెలీకుండానే గడిచిపోయాయి. గీతగోవిందం సినిమాతో రష్మికకు అన్ని సినీ పరిశ్రమలలో అవకాశాలు బాగానే వచ్చాయి. ఈమె ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేంజు లో స్థిరపడింది. ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా అని ప్రచారం జరుగుతోంది. ఫ్యాన్స్ కూడా వీరిద్దరూ మళ్ళీ కలిసి నటించాలని ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఇటీవల రష్మిక సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో ముచ్చటించింది. ఇందులో భాగంగా ఫ్యాన్స్ అడిగిన ఈ ప్రశ్నకు...రష్మిక... నాకు కూడా విజయ్ తో నటించాలనే ఉంది. కానీ సరైన కథ కోసం వెయిట్ చేస్తున్నాను అని హింట్ ఇచ్చింది. ఈ విషయాన్ని విన్న డైరెక్టర్స్ వీరిద్దరి కోసం మంచి పాన్ ఇండియా కథను రెడీ చేస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కాగా ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటిస్తుండగా...విజయ్ దేవరకొండ పూరి జగన్నాద్ లైగర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానున్నాయి. వీటన్నింటినీ బట్టి చూస్తే ప్రస్తుతం వీరిద్దరూ కూడా పాన్ ఇండియా హీరో హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. కాబట్టి నెక్స్ట్ సినిమా పాన్ ఇండియా సినిమా ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. మరి చూద్దాం ఏమి జరగనుందో...?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి