
ఓ నెటిజన్ తమన్‌ను అవమానించేలా మీమ్ పెట్టాడు. ఇందులో కింగ్ సినిమాలో బ్రహ్మానందం చేసిన కాపీ మ్యూజిక్ డైరెక్టర్ పాత్ర తాలూకు స్టిల్స్ ఉన్నాయి. ‘తన పిల్లలకు ఇతనే తమన్ అని చూపిస్తా..’ అంటూ సదరు నెటిజన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. అతడి ఉద్దేశ్యమేంటో అర్థమైన తమన్.. ఓ రేంజ్‌లో కౌంటర్ ఇచ్చాడు. 'దయచేసి నీ భార్యకు ఇలా మీమ్స్ చేసుకుంటూ ఉన్నానని చెప్పు బ్రో.. అప్పుడామె ఇలాంటి పనికి మాలిన మీమర్‌ను పెళ్లి చేసుకున్నానేంటా? అని చాలా గర్వపడుతుంది' అని ఓ రేంజ్ రిప్లై ఇచ్చాడు. తమన్ ఇచ్చిన డోస్‌కు నెటిజన్లంతా షాకయ్యారు.
నిజానికి తమన్‌పై నెట్టింట్లో ట్రోల్స్ రావడం ఇదే తొలిసారి కాదు. అతడి మ్యూజిక్‌పై అనేకసార్లు ఎంతో మంది కాపీ క్యాట్ అంటూ ట్రోల్స్ చేస్తూ ఉంటారు. దానిని తమన్ లైట్ తీసుకుంటూ ఉంటాడు. కొన్ని సార్లు క్యాపీ చేసే విషయాలపై థమన్ కరాఖండిగా సమాధానం కూడా చెబుతూ ఉంటాడు. తాను మ్యూజిక్ చేస్తానని, అయితే అందులో ఏదో ఒకటి రెండు ట్యూన్లు కలిసినంత మాత్రాన అది కాపీ కాదని అనేక ఇంటర్వ్యూల్లో చెబుతూ ఉంటాడు. అయినా అతడిపై ట్రోల్స్ మాత్రం ఆగవు. ఈ క్రమంలోనే తాజాగా తనపై వచ్చిన ఈ మీమ్స్‌పై తమన్ రెచ్చిపోయాడు. నెటిజన్‌పై విరుచుకుపడ్డాడు.