
ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ను ఈ మహమ్మారి వెంటాడింది. ఈయనకు కూడా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. ఇదే విషయాన్ని అభిమానులకు తెలియజేసాడు జూనియర్ ఎన్టీఆర్. తనకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని చెప్పాడు. అయితే ఏం సమస్య లేదని.. అంతా పూర్తి ఆరోగ్యంతో ఉన్నామని చెప్పాడు.
ఇక అభిమానులు ఇంత కూడా భయపడాల్సిన అవసరం లేదని తెలిపాడు జూనియర్. ఫ్యాన్స్ అంతా ధైర్యంగా ఉండమని చెప్పాడు ఈయన. తాను తన కుటుంబం అంతా బాగున్నామని.. ఫ్యామిలీ అంతా ఐసోలేట్ అయిపోయామని తెలిపాడు. నిరంతరం వైద్యుల సంరక్షణలోనే ఉన్నామని తెలిపారు. కోవిడ్‌కు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. తన స్టాఫ్‌లో కొందరికి పాజిటివ్ రావడంతో ఐసోలేట్ అయిపోయాడు జూనియర్. ఇప్పుడు ఆయనకు కూడా పాజిటివ్ వచ్చింది.
అయితే విషయం తెలుసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్టీఆర్ ఆరోగ్యంపై ట్విటర్ అకౌంట్ ద్వారా స్పందించారు. తారక్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండు అంటూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే తారక్ కు కరోనా సోకడంతో ఆయన కొత్త సినిమా ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్రభావం పడింది. రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య చిత్రీకరించాల్సిన సన్నివేశాలు వాయిదా పడ్డాయి. దీంతో ఇది సినిమా విడుదలపై కూడా ప్రభావం చూపుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.