మాస్ మహారాజ్ ఈ ఏడాది " క్రాక్ " సినిమాతో అదిరిపోయే విజయాన్ని అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నాడు. దాదాపుగా 9 ఏళ్ల తరువాత మాస్ మహారాజ్ కు " క్రాక్ " సినిమా సిసలైన బ్లాక్ బస్టర్ కిక్ ను ఇచ్చింది. దీంతో చాలా కాలం తరువాత వచ్చిన విజయాన్ని అలాగే కంటిన్యూ చేసేందుకు మాస్ రాజ్ సరికొత్త ప్రణాళికలతో వరుసస్ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ డైరెక్షన్ లో " ఖిలాడి " అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపుగా పూర్తి అయినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో రవి తేజ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఓ పాత్రలో పక్కా ఎంటర్ టైనర్ క్యారెక్టర్ లో నటిస్తుండగా, మరో పాత్రలో కాస్త నెగిటివ్ షెడ్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాడని సమాచారం.

 ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ లో కూడా మాస్ రాజ్ కాస్త నెగిటివ్ షెడ్ లో కనిపించాడు. ఇక ఈ సినిమాను మే 28న విడుదల చేయాలని భావించినప్పటికి కరోనా కరణంగా ఈ సినిమా వాయిదా పడింది. ఇక ఈ సినిమా తరువాత శరత్ అనే కొత్త దర్శకుడితో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా విభిన్న కథాంశంతో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే రవితేజ మూస కథలకు చెక్ పెట్టి వైవిద్యం ఉన్న కథలకు కమిట్ అవుతున్నాడని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న త్రినాథ్ రావు నక్కిన ప్రాజెక్ట్ ను పూర్తిగా పక్కన పెట్టినట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వస్తున్నాయి.

 గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందంటూ వార్తలు వచ్చాయి. అయితే స్టోరీ రొటీన్ మాస్ కంటెన్ కావడంతో మాస్ మహారాజ్ ఇంట్రెస్ట్ చూపడం లేదట. అయితే తాజాగా రవితేజ లైనప్ లో మరో పవర్ ఫుల్ డైరెక్టర్ పేరు కూడా బాగానే వినిపిస్తుంది. రవితేజ " భద్ర " సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం అయిన బోయపాటి రవితేజతో మరో సినిమా కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం " అఖండ " మూవీ తరువాత బోయపాటి రవితేజతో సినిమా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయితే త్రినాథ్ రావు నక్కిన ప్రాజెక్ట్ ఆగిపోయినట్టేనని ఇండస్ట్రీ వర్గాలు కొడై కూస్తున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: