ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా వచ్చిన వారికి ఆక్సిజన్ అందించడం తప్పనిసరి అయ్యింది.  కరోనా డైరెక్ట్ గా శ్వాసకోశ వ్యవస్థ పై ప్రభావం చూపడంతో ఆక్సిజన్ కృత్రిమంగా ఇవ్వడం తప్పనిసరి అయ్యింది. ఈ నేపథ్యంలో దేశంలోనే ఎప్పుడూ లేని విధంగా ఆక్సిజన్ కొరత ఏర్పడగా, ఈ ఆక్సిజన్ లేమి కారణంగా ఎంతో మంది ప్రాణాలు విడుస్తున్నారు. దాంతో ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేసే విధంగా కొంతమంది  ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజల కన్నీళ్లు చూడలేక ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నారు..

ఇప్పటికే చాలామంది ప్రముఖులు ఈ ఆక్సిజన్ బ్యాంకులను స్థాపించడానికి ప్రయత్నాలు చేసి సక్సెస్ అవగా తెలుగునాట చిరంజీవి ఆక్సిస్ బ్యాంకు కి శ్రీకారం చుట్టాడు. గుంటూరులో ప్రారంభం కాబోతున్న ఈ ఆక్సిజన్ బ్యాంకు యొక్క ఆక్సిజన్ సిలిండర్ లను ప్రత్యేకంగా పర్యవేక్షించారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజల్లో దేవుడిగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు నెలకొల్పడం ద్వారా వారి మనసుల్లో గుడి కట్టుకున్నారు. బ్లడ్ బ్యాంక్ ద్వారా నిత్యం ప్రజలకు సేవ చేస్తూ ఉన్న చిరంజీవి కోవిడ్ నేపథ్యంలో మొదటి నుంచి ప్రజలకు అండగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలు కొరత గా భావిస్తున్న ఆక్సిజన్ బ్యాంకును ఏర్పాటు చేశారు.

కర్ణాటకలో ఇప్పటికే ఆక్సిజన్ బ్యాంకును ఏర్పాటు చేయగా తెలుగు రాష్ట్రాల్లో ఇవ్వాళ తొలి ఆక్సిజన్ బ్యాంకు చిరంజీవి ద్వారా అందుబాటులోకి రానుంది. ఈ పనులన్నీ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ దగ్గరుండి చూసుకుంటున్నారట. ఆయా ప్రాంతాల్లో చిరంజీవి అభిమాన సంఘాల సీనియర్ అధ్యక్షులు ఎక్కడికక్కడ ఈ బ్యాంకు ఏర్పాటు బాధ్యతలను చూసుకుంటున్నారు. చిరంజీవి అండగా మెగా అభిమానులు సైతం కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. తమవంతు విరాళాలు అందించడం గొప్ప విషయం అని చెప్పవచ్చు. ఏదేమైనా సినిమా హీరోలు ప్రజల ఆరోగ్యం కోసం ఇంత చేయడం గొప్ప విషయం అని చెప్పవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: