క్రికెట్ అంటే చూడని అభిమానులు అంటూ ఎవరూ ఉండరు. ఇక ఐపీఎల్ అంటే ప్రత్యేకంగా అందరికీ చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు చూస్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు ఐపీఎల్ గురించి ఒక టీం లో  ముఖ్యమైన సమాచారం విడుదలైంది. అదేమిటంటే, 2013లో ముంబై ఇండియన్స్ కి కెప్టెన్ గా బాధ్యతలు చేపడుతున్న రోహిత్ శర్మ వరుసగా  2013,2015,2017,2019,2020 సీజన్లలో  ఆ జట్టు ని టైటిల్ విజేతగా నిలిపాడు.


అయితే ఇది ఇలా ఉండగా 14 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఎక్కువ టైటిల్స్ గెలిచిన కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలిచాడు. అయితే 2011లోనే రోహిత్ శర్మ ని తీసుకొనే ఛాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ కి లభించింది.. కానీ 2011 ఐపీఎల్ సీజన్ వేలానికి రెండు రోజుల ముందే తాము రోహిత్ శర్మ కోసం బిడ్ వేయబోమని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ప్రకటించేసింది.


అలా చెప్పడానికి కారణం ఏమిటో అది ఇప్పటికీ మిస్టరీనే.. దక్కన్ చార్జర్స్ తరఫున అప్పటికే సత్తాచాటిన రోహిత్ శర్మ కోసం 2011 లో ఐపీఎల్ సీజన్ ఆటగాళ్ల వేలంలో పంజాబ్ కింగ్స్ టీమ్ గట్టిగానే ప్రయత్నించింది. ముంబై ఇండియన్స్ కి పోటిగా వేలంలో పంజాబ్ తో పాటు మళ్లీ డెక్కన్ చార్జెస్ కోట్లు కుమ్మరించడానికి  సిద్ధమయ్యాయి. కానీ.. చివరి వరకు పట్టువదలని ముంబై ఇండియన్స్, ఏకంగా రూ.9.2 కోట్లకి హిట్ మ్యాన్ ని కొనుగోలు చేసింది. అయితే అప్పటికి ముంబై ఒక్క టైటిల్ కూడా గెలవలేదు.

కానీ చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం అప్పటికే ఒక టైటిల్ 2010 లో గెలిచింది. ఇక 2011లో చెన్నైటీం టోర్నీ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే 2011 సీజన్ వేలానికి రెండు రోజుల ముందు రోహిత్ శర్మ ను కొనుగోలు చేయాలని చెన్నై సూపర్ కింగ్స్ ను ఓ అభిమాని  ట్విట్టర్లో రిక్వెస్ట్ చేశాడు. కానీ.. రోహిత్ శర్మ కోసం తమ్ముడూ ప్రయత్నించవద్దని రిప్లై ఇచ్చేసింది. ఆ సమయంలో మహేంద్రసింగ్ ధోని కెప్టెన్సీ లో రోహిత్ శర్మ దక్షిణాఫ్రికా గడ్డపై మ్యాచ్ లు ఆడుతుండడం గమనార్హం.



మరింత సమాచారం తెలుసుకోండి: