టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో ముఖ్యంగా మన హీరోలు, హీరోయిన్ లు ఎక్కువగా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యే పాత్రలను ఎంచుకుంటున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అందులో భాగంగానే ప్రజలకు బాగా దగ్గరయ్యే ముఖ్యమంత్రి పాత్రల్లో నటించి, ప్రేక్షకులను బాగా మెప్పించిన స్టార్ హీరోలు, హీరోయిన్ లు ఎంతో మంది ఉన్నారు. ఇక అంతే కాకుండా నిజ జీవితంలో కూడా సినిమాల నుంచి వచ్చి, రాజకీయాల్లోకి ప్రవేశించిన వారు కూడా ఎంతో మంది ఉన్నారు. ఉదాహరణకు తెలుగు ప్రజలు ఎంతో ముద్దుగా పిలుచుకునే అన్నగారు ఎన్టీఆర్ తెలుగుదేశం అనే రాజకీయ పార్టీని స్థాపించి, కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి సంచలనం సృష్టించారు. రియల్ లైఫ్ లో సీఎం అయిన ఎన్టీఆర్, రీల్ లైఫ్ లో మాత్రం ఆ క్యారెక్టర్ చేయలేకపోయారు. కానీ ఈ కాలంలో ఎక్కువ మంది సీఎం పాత్రలో నటిస్తున్నారు. అయితే ఆ స్టార్ నటులు ఎవరు? వారు నటించిన సినిమాలు ఏమిటి?అనే విషయాలను ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1. తలైవి :తలైవి సినిమాలో కంగనా రనౌత్ ఒకప్పటి హీరోయిన్ అలాగే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో కనిపించనుంది. ఇక ఈ సినిమాలో సీఎం పాత్రలో కంగనా ఎలా యాక్ట్ చేసిందో ఇప్పటికే ట్రైలర్ విడుదల చేసి, అందరిని మెస్మరైజ్ చేశారు దర్శక నిర్మాతలు.

2. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు:ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాలలో, ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పాత్రలో ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ నటించారు.

3. యాత్ర:ఈ సినిమాలో మమ్ముట్టి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి లాగ ముఖ్యమంత్రి గా నటించారు.

4.ఎన్ జీ కే :సూర్య హీరోగా నటించిన ఈ చిత్రంలో నందగోపాల్ కుమారునిగా ఓ సామాన్య వ్యక్తి ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు అనేదే ఈ సినిమా స్టోరీ.

5. నోటా :విజయ్ దేవరకొండ ముఖ్యమంత్రి పాత్రలో ప్రేక్షకులను అలరించాడు.

6. భరత్ అనే నేను:ఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా ప్రేక్షకులని బాగా మెప్పించాడు.

7. లీడర్:రానా హీరోగా నటించిన ఫస్ట్ మూవీ లోని తను సీఎం క్యారెక్టర్లో అదరగొట్టాడు.

8. అధినేత:2009లో వి. సముద్ర దర్శకత్వంలో వచ్చిన అధినేత సినిమాలో జగపతి బాబు సీఎం క్యారెక్టర్ లో ప్రేక్షకులను బాగా మెప్పించాడు.

9. రక్త చరిత్ర :సీఎం ఎన్టీఆర్ పాత్రలో శత్రుఘ్న సిన్హా ఈ చిత్రంలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.

10. భగీరథుడు :ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత ఆయన జీవిత చరిత్ర పై ఈ సినిమాను తెరకెక్కించారు.

11. సూపర్:ఉపేంద్ర కూడా కన్నడలో విదేశాల నుంచి వచ్చిన ఒక ఎన్నారై సుభాష్ చంద్ర గాంధీ ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు అనే కథతో తెరకెక్కించారు.

12. ఒకే ఒక్కడు :1999లో ఒక్కరోజు హీరో అనే కాన్సెప్ట్ తో అర్జున్ ముఖ్యమంత్రిగా అదరగొట్టాడు.


13. ఎమ్మెల్యే ఏడుకొండలు:దాసరి నారాయణరావు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో, దాసరి నారాయణ సీఎం పాత్రలో బాగా అలరించారు.

14. రాజకీయ చదరంగం :1989లో విడుదలైన ఈ చిత్రంలో ఏఎన్నార్ సీఎంగా కనిపించారు.

15. ముఖ్యమంత్రి :1984లో విడుదలైన ఈ చిత్రంలో కృష్ణ టైటిల్ పాత్రను పోషించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: