టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గతంలో బిగ్ బాస్ షో తో హోస్ట్ గా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మళ్ళీ చాలా కాలం తర్వాత  మరోసారి బుల్లితెరపై కనువిందు చేయడానికి ఓ సరికొత్త షో తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.  కొద్ది రోజుల క్రితం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా 'ఎవరు మీలో కోటీశ్వరులు(EMK)' అనే రియాలిటీ షోను గ్రాండ్‌గా అనౌన్స్ చేయడం జరిగింది. అసలైతే  షెడ్యూల్ ప్రకారం ఈ ప్రోగ్రాం మే చివరివారం నుంచి ప్రసారం కావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ షో వాయిదా పడింది. ఇక ఈ షో ఈ ఏడాది టెలికాస్ట్‌ కాదనే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. 

కరోనా ఉధృతి తగ్గగానే ఎన్టీఆర్‌ ఇంతకు ముందు కమిటైన సినిమాల షూటింగ్స్‌లో బిజీ కానున్నారని, ఆ సమయంలో ఈ షోకి డేట్స్‌ సర్థుబాటు చేసుకోవడం ఆయనకు వీలుకాదని, అందుకే షో వాయిదా పడబోతుందని వార్తలు వినిపించాయి.ఈ నేపథ్యంలో జెమిని టీవీ యాజమాన్యం తాజాగా ఓ ప్రోమో వదిలి రూమర్లకు చెక్‌ పెట్టింది.త్వరలోనే ఈ షో ప్రారంభం కానుందని ప్రోమో ద్వారా తెలిపింది. 'EMK ఆడుతున్న వారి కలలను నెరవేరుస్తుంది. ఇటు చూస్తున్న వారికి వంద శాతం వినోదాన్ని అందజేస్తుంది'అని ప్రోమోని విడుదల చేసింది.

 అయితే ఈ షో ఎప్పటి నుంచి మొదలవుతుందనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే ఇక గతంలో ఇదే షో ని స్టార్ మా ఛానెల్ లో నాగార్జున, చిరంజీవి లాంటి హీరోలు హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈసారి మాత్రం జెమిని టీవీలో కాస్త పేరు మార్చి ఎవరు మీలో కోటీశ్వరలు పేరుతో జూనియర్ ఎన్టీఆర్ ఈ షో ని హోస్ట్ చేయనున్నాడు.ఇక తారక్ సినిమా విషయానికొస్తే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న rrr సినిమాలో నటిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది.అక్టోబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తన 30 వ సినిమా చేయనున్నాడు తారక్...!!



మరింత సమాచారం తెలుసుకోండి: