సీనియర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన అంకుశం సినిమా 1990లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఈ సినిమాతోనే ప్రతినాయకుడు రామిరెడ్డి వెండితెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రంలో రాజశేఖర్, జీవిత హీరో, హీరోయిన్లుగా నటించారు. అయితే యాక్షన్ డ్రామాగా విడుదలైన ఈ సినిమా కోడి రామకృష్ణ, రాజశేఖర్ ల సినీ కెరీర్ ని పూర్తిస్థాయిలో మలుపు తిప్పింది. ఈ సినిమా ఇతర భాషల్లో రీమేక్ చేయగా.. అవి కూడా సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. ఈ చిత్రంలో గుండాలను మట్టికరిపించే పవర్‌ఫుల్‌ పోలీస్ ఆఫీసర్‌గా రాజశేఖర్ నటించారు. ఆయన తన ప్రాణాలను సైతం కోల్పోయి తన గురువైన ముఖ్యమంత్రి ప్రాణాలు కాపాడి వీరమరణం పొందుతారు.


ఈ చిత్రంలో రాజశేఖర్ ముక్కు మీద కోపం ఉన్న పోలీస్ ఆఫీసర్ గా నటించారు. ఈ సినిమా విడుదల తర్వాత రాజశేఖర్ కి `యాంగ్రీ యంగ్ మ్యాన్‌` గా పేరొచ్చింది. నిజానికి రాజశేఖర్ తన సినీ జీవిత కాలంలో అంకుశం లో చూపించిన ఉగ్రావతారం ఇతర ఏ సినిమాల్లోనూ చూపించలేదు. ఆయన చెప్పిన డైలాగులు అన్నీ కూడా ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి.



అయితే ఈ చిత్రంలో అతి భయంకరంగా నటించిన రామిరెడ్డికి నంది అవార్డు లభించింది. ఈ చిత్ర కథకు కూడా నంది పురస్కారం లభించింది. అందుకే ఇదే కథతో మెగాస్టార్ చిరంజీవి హిందీలో ‘ప్రతిబంద్’ టైటిల్ తో ఓ సినిమా చేశారు. విశేషం ఏంటంటే.. ఈ సినిమాతోనే చిరు బాలీవుడ్ లో అరంగేట్రం చేశారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ స‌త్యం స్వరపరిచిన సాంగ్స్ సందర్భోచితంగా సాగుతూ సినిమాని మరింత ఆసక్తికరంగా మార్చాయి. అన్ని పాటల్లోకెల్లా “ఇది చెరగని ప్రేమకు శ్రీకారం” పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఎంతగా అంటే ఇప్పటికీ ఈ పాట వినే వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇకపోతే టాలీవుడ్ పరిశ్రమలో సంచలనం సృష్టించిన "అంకుశం" సినిమా విడుదలై ఇప్పటికే 30 సంవత్సరాలు దాటింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: