కొంతమంది దర్శకులు తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్లు కొడుతూ ఉంటారు. వారిలోని శక్తినంతా కూడగట్టుకొని, ప్రతిభ నంతా ఉపయోగించి దర్శకులు తొలి సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టి పెద్ద హీరోలు, పెద్ద నిర్మాతల కళ్ళలో పడుతూ ఉంటారు. అయితే రెండవ సినిమా కి వచ్చేసరికి కొంతమంది ఈ ద్వితీయ విఘ్నం ను దాటలేకపోతారు. ఆ విధంగా ప్రస్తుతం ఉన్న యంగ్ దర్శకులలో మొదటి సినిమా సూపర్ హిట్ కొట్టి రెండో సినిమా తెరకెక్కిస్తున్న వారు ఎవరు ఉన్నారు అనేది ఒకసారి చర్చించుకుందాం.

గోపీచంద్ హీరోగా తెరకెక్కిన జిల్ సినిమాతో తన సత్తా చాటుకున్నాడు దర్శకుడు రాధాకృష్ణ. ఆ సినిమా టెక్నికల్ గా ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది. అయితే రాధాకృష్ణ వెంటనే మరో కథని పట్టా లెక్కించకుండా ఆలస్యమైనా ప్రభాస్ తోనే రాధే శ్యామ్ సినిమా మొదలుపెట్టారు ప్రస్తుతం తుదిదశ చిత్రీకరణలో ఉంది. మరి  ఆయన తలపెట్టిన ఈ రెండో ప్రయత్నం ఆయనను ఏ స్థాయికి తీసుకు వెళుతుందో చూడాలి.  ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా తో స్వరూప్ దర్శకుడిగా పరిచయం అయి తొలి సినిమాతోనే హిట్ కొట్టారు. ఇప్పుడు రెండవ ప్రయత్నంగా మిషన్ ఇంపాజిబుల్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో తాప్సీ కీలక పాత్రలో నటిస్తుండగా ఈయన రెండో ప్రయత్నం ఏం చేస్తుందో చూడాలి.

పలాస చిత్రంతో కరుణాకర్ అనే కొత్త దర్శకుడు తెలుగుతెరపై మెరిశారు ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో మెట్రో కథలు అనే పేరుతో ఓ వెబ్ సిరీస్ రూపొందించగా ఈయన ప్రస్తుతం సుధీర్ బాబు హీరోగా శ్రీదేవి సోడా సెంటర్ అనే పల్లెటూరు సినిమా నీ తెరకెక్కిస్తున్నారు. మరి ఈయన రెండో ప్రయత్నం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే. హిట్ సినిమాతో తొలి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న శైలేష్. ఈ సినిమాకి సీక్వెల్ గా హిట్ 2 సినిమా తీస్తున్నారు. అడవి శేష్ హీరోగా చేస్తున్న ఈ సినిమా శైలేష్ కి రెండవ హిట్ ను అందిస్తుందా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: