ప్రస్తుతం ప్రేక్షకులు ఆస్వాదించే వినోదం యొక్క పద్ధతి మారిపోయింది. సినిమాలు చూసే రూటు చేంజ్ అయింది. గతంలో వీకెండ్ వచ్చిందంటే చాలు సినీ ప్రేక్షకులు
సినిమా థియేటర్లలో వాలిపోయి ఎంచక్కా ఎంజాయ్ చేసే వారు. కానీ ఇపుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.కరోనా రావడం వల్ల థియేటర్లు మూసుకొని ఉండడం తో అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. ఈ పరిస్థితిని గమనించిన కొందరు ఓటీటీ లతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం మొదలు పెట్టారు.
ఆ విధంగా ఇప్పుడు ఎన్నో ఓటీటీ లు అవతరించగా ఈ ఓటీటీ లలో ప్రతి వారం సినిమాలను విడుదల చేస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇది అందరి ప్రేక్షకులకు అలవాటు కాగా ఈ వారం రాబోయే సినిమాల గురించి ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులకు నచ్చే మెచ్చే సినిమాలను విడుదల చేస్తూ వారిని ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
మరి ఈ వారం
ఓటీటీ ల ద్వారా ప్రేక్షకులను అలరించబోయే సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
అమెజాన్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా బాలన్ దర్శకత్వంలో తెరకెక్కిన గోల్డ్ కేస్
సినిమా జూన్ 30 న విడుదల కాబోతుంది.
నెట్ ఫ్లిక్స్ లో జూలై 2 న
తాప్సి ప్రధానపాత్రలో తెరకెక్కిన హసీన్
దిల్ రుబా విడుదల కానుంది. యాక్షన్ చిత్రం గా తెరకెక్కిన ది టుమారో
వార్ కూడా జూలై 2న
అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. ప్రముఖ ఐటి సంస్థ ఎంఎక్స్ ప్లేయర్ లో సమంతార్ రెండవ సీజన్ జూలై 2 న విడుదల కానుంది. జులై 3న
నెట్ ఫ్లిక్స్ లో
అనాటమీ, సోనీ లో చట్జ్ పా విడుదల కానున్నాయి. ఇక ఎప్పటిలాగే ఈ వారం కూడా ప్రేక్షకులను అలరించడానికి మంచి మంచి సినిమాలతో ఒటీటీ లు సిద్ధంగా ఉన్నాయి.