కమల్ హాసన్ దర్శకత్వంలో దక్షిణాదిన పెద్ద దర్శకుడుగా పేరున్న
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన
ఇండియన్ 2
సినిమా ఎట్టకేలకు తిరిగి ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన
ఇండియన్ సినిమాకు కొనసాగింపుగా భారీ అంచనాలతో భారీ బడ్జెట్ తో ఈ
సినిమా తెరకెక్కుతుండగా ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన ఈ
సినిమా షూటింగ్ మధ్యలోకి రాగానే కొన్ని సమస్యలతో ఆగిపోయింది. ఆ వివాదాలు ఎంత దాకా వెళ్లాయి అంటే దర్శక నిర్మాతలు కోర్తుకెక్కేదాకా వెళ్లాయి.
దీంతో ఈ
సినిమా ఆగిపోయిందని అనుకున్నారు. అందుకు తగ్గట్లే ఈ
సినిమా హీరో కమల్ వేరే
సినిమా చేసుకోవడం, దర్శకుడు ఇతర ప్రాజెక్టులను సెట్ చేసుకోవడం జరగగా
ఇండియన్ 2
సినిమా ఇక ముందుకు కదలదు అని ఆ
సినిమా ఫ్యాన్స్ ఎంతో నిరాశ చెందారు. ఒకపక్క ఈ సమస్యతో
శంకర్ సతమతమవుతూనే మరొక పక్క తన కూతురు
పెళ్లి పనుల్లో హడావుడిగా ఉన్నాడు. అయితే ఆమె
పెళ్లి చేశాక కొంత రిలీఫ్ అయిన
శంకర్ ఈ
సినిమా సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తున్నారు.
హై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో ఎవరు అంచనా వేయలేకపోతున్న నేపథ్యంలో
శంకర్ తనకు తీర్పు అనుకూలంగా రావాలని దీని నుంచి తొందరగా బయటపడి తన తదుపరి సినిమాకు వెళ్లిపోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా తమిళనాడు హైకోర్టు ఈ
సినిమా ఇష్యూ పై మాజీ సుప్రీంకోర్టు జడ్జి ఆర్ పనుమతి ని మధ్యవర్తిగా నియమించడం జరిగిందట. ఆయన స్టేట్ మెంట్ అనంతరమే ఈ ఇష్యూ పై ఒక తుది తీర్పు వెల్లడించడం జరుగుతుందని తెలుస్తుంది. మరి తదుపరి విచారణ ఎప్పుడు జరుగుతుంది అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.. ఇకపోతే భారీబడ్జెట్ తో తెరకెక్కిన ఈ
సినిమా లో అందరు స్టార్స్ నటిస్తుండడం విశేషం.