తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీమణి ఛార్మి. తొలి సినిమా నుంచే తన అందచందాలతో టాలీవుడ్ ప్రేక్షకుల చూపుతిప్పుకోకుండా చేయడంలో ఛార్మి సక్సెస్ అయింది. నీ తోడు కావాలి అనే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైన చార్మి మాస్ చిత్రం ద్వారా కమర్షియల్ హిట్ ను అందుకుంది. ఆ తర్వాత ఎన్నో సూపర్హిట్ చిత్రాల్లో హీరోయిన్  చేసి లేడీ ఓరియంటెడ్సినిమాలు చేసే అంత క్రేజ్ ను సంపాదించుకుంది. 

తెలుగులోనే కాకుండా మొదటి నుంచి హిందీ తమిళ మలయాళ కన్నడ భాషల్లో కూడా కాన్సన్ ట్రేట్ చేస్తూ అక్కడ హీరోయిన్ గా నిలదొక్కుకునే ప్రయత్నం చేయగా ఆమెకు తెలుగులో వచ్చిన స్టార్ డమ్ ఈ భాషలోనూ రాలేదని చెప్పాలి.  ఇక్కడి ప్రేక్షకులు ఆమెకు, అమే బొద్దు అందాలకు బ్రహ్మరథం పట్టారు.  ఇప్పుడు ప్రొడ్యూసర్ గా తనదైన స్టైల్లో సినిమాను తెరకెక్కిస్తుంది. ఈమెకు దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా తోడవడంతో సినిమాల నిర్మాణాలు చేసుకుంటూ ప్రొడ్యూసర్ గా ముఖ్యంగా మహిళా నిర్మాతగా తన సత్తా చాటుకుంటుంది. 

సినీ లైఫ్ లో ఎంతో సక్సెస్ ఫుల్ అయినా చార్మి తన పర్సనల్ లైఫ్ లో మాత్రం అంతగా సక్సెస్ ఫుల్ కాలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈమె ఇండస్ట్రీకి దూరమైన ఇన్ని సంవత్సరాలు అయినా కూడా పెళ్లి చేసుకోలేదు. టాలీవుడ్ టాప్ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తో ప్రేమలో ఉందని వివాహం కూడా చేసుకోండి ఉందని వార్తలు వచ్చాయి కానీ అవి నిజం కాలేదు. వాస్తవానికి చార్మి నిజంగా వివాహం చేసుకోనుందనే ఓ వార్త అప్పట్లో హల్ చల్ చేయగా ఆమె తన సమీప బంధువును పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్లు ఆమె పేరెంట్స్ కూడా దానికి ఓకే చెప్పినట్లు వార్తలు షికార్లు చేశాయి. అయితే ఆమె ఆ పెళ్లి నీ ఆ తర్వాత కొన్ని కారణాలతో క్యాన్సల్ చేసుకోవడం మనం చూశాం. మరి ఇప్పటికైనా ఆమె వివాహం చేసుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: