టాలీవుడ్ లో ఫీల్ గుడ్ దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన ప్రస్తుతం నాగచైతన్య కథానాయకుడు గా లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు. సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యూట్యూబ్ లో ఈ సినిమాకి సంబంధించిన పాటలు ఇప్పటికీ ట్రెండ్ గా నిలుస్తుండగా ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచుతున్నాయి.

మొదటి నుంచి చిన్న సినిమాలతో చిన్న హీరోలతో హిట్లు కొడుతూ వచ్చిన శేఖర్ కమ్ముల ఈ సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకుంటారు అనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆయన అభిమానులు. ఇక టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన ఆయన తన తదుపరి చిత్రాన్ని ధనుష్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. దీని గురించి అధికారిక ప్రకటన ఇటీవల ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి కొంతమంది శేఖర్ కమ్ముల లాంటి డైరెక్టర్  కోలీవుడ్ లో ఇంత పెద్ద హీరో తో సినిమా ఓకే చేసుకున్నాడా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తోంది. తెలుగు తమిళ హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టును త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతల ఆలోచన.  ఈ సినిమాలో మరో హీరో కూడా ఉన్నాడనే వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ పాత్రలో ఎవరిని నటింప చేయాలని నిర్మాతలు దర్శకులు చర్చిస్తున్నారట.  మూడు భాషల్లో విడుదల అవుతుంది కాబట్టి మూడు భాషల్లో పేరున్న నటుడు ని తీసుకుంటే బాగుంటుందని వీరందరూ ఆలోచిస్తున్నారట. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలలో ఎవర్నో ఒకర్ని తీసుకునే ఆలోచన చేస్తున్నారట. ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకాస్త సమయం ఉండడతో
 ఈ లోపు ఒక మంచి నటుడిని వెతకాలని డిసైడ్ అయ్యారట. ప్రస్తుతం ధనుష్ చేతిలో వేరే సినిమాలు ఉన్నాయి ఆ సినిమాలో తర్వాత శేఖర్ కమ్ముల తో చేతులు కలుపుతాడు ధనుష్. 

మరింత సమాచారం తెలుసుకోండి: