సౌత్ లోనే భారీ క్రేజ్ ఉన్న హీరోయిన్ నయనతార. ఆమె తమ సినిమాలో ఉంటే హిట్టు అన్నట్లే వ్యవహరిస్తుంటారు దర్శక నిర్మాతలు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో హీరో స్థాయి అందుకుంటూ రోజురోజుకూ క్రేజ్ ను మరింతగా పెంచుకుంటూ పోతున్న నయనతార కి తెలుగు సినిమా ఇండస్ట్రీ పై మొదటి నుంచి కొంత చులకన భావాన్ని చూపిస్తుంది అని భావిస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. ఎందుకంటే ఆమె కాళ్ల దగ్గరికి వచ్చిన చాలా సినిమాలను రిజెక్ట్ చేసింది నయనతార.

అందరూ ఎక్కువ సినిమాలు హీరోలు నచ్చకనే రిజెక్ట్ చేసిందనే ఒక ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో. దానికి తగ్గట్లు ఆమె గతంలో చాలామంది పెద్దపెద్ద హీరోల సినిమాలను రిజెక్ట్ చేసి వార్తల్లో నిలిచింది. ఎప్పుడో గానీ ఆమె తెలుగు సినిమాల్లో నటించడానికి ఒప్పుకోదు. తమిళ సినిమా ఇండస్ట్రీలో సీనియర్ , యంగ్ హీరోలు అనే తేడా లేకుండా ఆమె అందరితో నటిస్తూ అక్కడ స్టార్ హీరోయిన్ గా , నెంబర్ వన్ హీరోయిన్ గా ఉంది. సౌత్ లోనే అన్ని భాషల్లో కలిపి నటిస్తూ ఆమె సౌత్ లో తిరుగులేని హీరోయిన్ గా ఉంది.

అలాంటి నయనతార తాజాగా మహేష్ బాబు సరసన నటించే అవకాశం వస్తే దాన్ని కూడా రిజెక్ట్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. కాగా ఆయన తదుపరి చిత్రం  త్రివిక్రమ్ తో చేస్తున్నాడు. ఎంతో ఆసక్తిని కలిగించే ఈ కాంబినేషన్ లో నటించడానికి హీరోయిన్ లు ఎగబడతారు కానీ నయనతార సింపుల్ గా నో చెప్పిందట. దాంతో సూపర్స్టార్ అభిమానులు ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మహేష్ బాబు సినిమా అవకాశం వస్తే రిజెక్ట్ చేస్తావా అంటూ ఆమెను విపరీతంగా త్రోల్ చేస్తున్నారు. మరి టాలీవుడ్ హీరోల మీద ఉన్న భావన ఆమెకు ఎప్పుడు పోతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: