భారతదేశంలో ఐశ్వర్యరాయ్ అంటే తెలియని వారు ఉండరు. నటిగా తన అందంతో ఎంతో మంది ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన హీరోయిన్ ఐశ్వర్యారాయ్. విశ్వసుందరిగా ఐశ్వర్యారాయ్ ఎంపిక అయిన దగ్గర నుంచి ఆమెకు ఇండియాలో క్రేజ్ భారీగా నెలకొంది. తన కళ్ళ తోనే మాయ చేస్తూ ఎంతో మంది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకుని వారిని ఎంతో కాలం నుండి అలరిస్తూ వస్తోంది . ఐశ్వర్య రాయ్ అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ తో వివాహం చేసుకొని సినిమాలను తగ్గిస్తూ వచ్చింది.

అంతకుముందు గ్లామర్ డాల్ గా ఐశ్వర్యరాయ్ ఎన్నో బాలీవుడ్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది.  ఎన్నో సంవత్సరాలు ఆమె అందానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది అని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు. ఇప్పటికీ అదే చెక్కుచెదరని అందంతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది. ఆమె కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేసిన కొన్ని సినిమాలను వదిలేసుకుంది. ఆ సినిమాలు చేసి ఉంటే మరింత టాప్ లోకి దూసుకుపోయేదేమో. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

1996 లో అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన రాజా హిందుస్తానీ సినిమాలో ఐష్ ను తీసుకుందాం అనుకున్నారు కానీ కరిష్మా కపూర్ ఎంపికయింది. యశ్ చోప్రా తెరకెక్కించిన ఆల్ టైం బ్లాక్ బస్టర్ దిల్ తో పాగల్ హై సినిమా లో కూడా మాధురి దీక్షిత్ పాత్ర కోసం ఐశ్వర్య ను అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఆమె సినిమా చేయలేకపోయారు. షారుక్ ఖాన్ నటించిన కుచ్ కుచ్ హోతా హై సినిమా లో కూడా ఐశ్వర్య హీరోయిన్ గా అనుకున్నారు కానీ రాణిముఖర్జీ ఆ తరువాత ఎంట్రీ ఇచ్చింది. షారుక్ ఖాన్ ప్రీతి జంట నటించిన బ్లాక్ బస్టర్ వీర్ జర లో ఐశ్వర్య నే ముందు హీరోయిన్.  హ్యాపీ న్యూ ఇయర్ సినిమాలో కూడా దీపిక పడుకునే బదులు ఐష్ ను తీసుకుందాం అనుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: