యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈయనకు  మంచి వ్యక్తిత్వం, డెడికేషన్, కష్టపడే తత్వం వల్ల సినిమాలన్నీ  మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. అంతే కాదు  ఒక్కోసారి షూటింగ్ సమయంలో ఈయనకి గాయాలు కూడా తగిలాయి. తన అభిమానుల కోసం ఏదైనా చేస్తాను అంటూ ఒకానొక సమయంలో తెలిపారు ఎన్టీఆర్.ఇక్కడ ఒక బుడ్డోడు ఎన్టీఆర్ ని బాక్సింగ్ ఆడుతున్నాడు.. ఆ బుడ్డోడు ఎవరో తెలుసుకుందాం.


ఎన్టీఆర్ ప్రణీత మే 5 -2009 లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికు అభయ్ రామ్, భార్గవ్ రామ్ అనే ఇద్దరు కుమారులు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. ఇక తన పెద్ద కుమారుడు అభయ్ చాలా సైలెంట్ అని, తన చిన్న కుమారుడు మాత్రం బాగా అల్లరి చేస్తాడని బయటకు వార్తలు వచ్చాయి. తాజాగా వీరిద్దరి మధ్య ఒక వీడియో బయటికి వచ్చింది.


ఈ వీడియోలో అభయ్ రామ్ చేసిన అల్లరికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక ఎన్టీఆర్ తన సినిమాలలో విలన్ లని ఎంతగా చితకబాదుతారో మనకు తెలిసిందే. సినిమా లో ఎటువంటి సీన్లు అయినా ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా అందించగలడు. ఇదంతా కేవలం సినిమాలలో  మాత్రమే. అయితే తన ఇంట్లో మాత్రం తన పిల్లలతో ఎంత సరదాగా ఉంటారంటే.. తన కుమారుడి చేతిలో దెబ్బలు తినే అంతగా ఉన్నారు ఎన్టీఆర్.

ఎన్టీఆర్ మాత్రం తమ కుమారుడిని ఒక్క మాట కూడా అనుకోకుండా మౌనంగా దెబ్బలు తిన్నారు. ఇలా తన కుమారుడు అభయ్ చేత దెబ్బలు తినడం ఎన్టీఆర్ కి  ఎంతో ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది. తన తండ్రిని పిడికిలి బిగించి ముఖం మీద బాక్సింగ్ ఆడుతున్నట్లు ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అంతేకాకుండా ఈ వీడియో చూసిన నెటిజన్లు అందురూ ntr తన  కుమారుడిని  కూడా బాలనటుడిగా పరిచయం చేస్తే బాగుంటుందని కామెంట్ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: